- దిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసం వద్ద ఉద్రిక్తత
- కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ ఆప్ నేతల ఆందోళన
- కేజ్రీవాల్ నివాసం వద్ద ఆప్ నేతలు, కార్యకర్తల నిరసన
- ఆందోళనకు దిగిన ఆప్ నేతలు, కార్యకర్తల అరెస్టు
- ఆప్ ఎమ్మెల్యే రాఖీ బిర్లాను అరెస్టు చేసిన పోలీసులు
- దిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టును ఖండించిన ఆప్ నేతలు
- కేజ్రీవాల్ దిల్లీ ముఖ్యమంత్రిగానే కొనసాగుతారు: అతిషి
- దిల్లీ సర్కారును కేజ్రీవాల్ జైలు నుంచే నడిపిస్తారు: అతిషి
- కేజ్రీవాల్ అరెస్టుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాం: అతిషి
- ఈ రాత్రికే అత్యవసరంగా విచారించాలని కోరుతాం: అతిషి
- సుప్రీంకోర్టును ఆశ్రయించిన దిల్లీ సీఎం కేజ్రీవాల్ తరఫు న్యాయవాది
- దిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు
- అరెస్టు నుంచి కేజ్రీవాల్‌కు మినహాయింపు ఇవ్వలేమన్న దిల్లీ హైకోర్టు
- పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోరిన కేజ్రీవాల్ న్యాయవాదులు
- పిటిషన్‌ను శుక్రవారం విచారిస్తామని తెలిపిన సుప్రీంకోర్టు
- గురువారం రాత్రే విచారించాలని కోరిన కేజ్రీవాల్ న్యాయవాదులు
- 09.38 PM
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను స్పెషల్ PMLA కోర్టు ముందు ఈడీ అధికారులు హాజరుపరచనున్నారు. విచారణ కోసం కస్టడీ కోరనున్నారు.
- 09.15 PM
Kejriwal Arrested :దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లిన ఈడీ అధికారులు, ఆయన్ను అరెస్టు చేశారు. అంతకముందు ఆయన ఫోన్‌ను సీజ్ చేశారు. అయితే ఆయన జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తారని మంత్రి ఆతిషి తెలిపారు. సుప్రీం కోర్టులో కేసు వేశామని, అత్యవసరంగా విచారించాలని సర్వోన్నత న్యాయస్థానాన్నిడిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు.
ED At Kejriwal Home :దిల్లీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ఇటీవల భారాస నేత కవితను అరెస్టు చేసిన ఈడీ అధికారులు, తాజాగా దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లారు. దాదాపు 12 మంది అధికారులతో కూడిన ఈడీ బృందం ఆయనకు పదోసారి సమన్లు ఇచ్చేందుకు వెళ్లినట్లు సమాచారం. సీఎం నివాసం వద్ద సిబ్బంది ఆరా తీయగా, సెర్చ్ వారెంట్‌తోనే వచ్చామని చెప్పినట్లు తెలుస్తోంది.
"పోలీసులు లోపలికి వెళ్లడం, ఎవరినీ లోపలికి అనుమతించకపోవడాన్ని బట్టి చూస్తుంటే సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయాలని వారు ప్లాన్ చేసినట్లు అర్థమవుతోంది" అని దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. ఒకవేళ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేస్తే దిల్లీ ప్రజలంతా ఇక్కడికి చేరుకుంటారని, ఆయనకు అండగా ఉంటారని మరో మంత్రి ఆతిషి తెలిపారు.
ప్రస్తుతం కేజ్రీవాల్‌ను విచారిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజా పరిణామాలతో సీఎం ఇంటివద్ద భారీగా పోలీసులు, భద్రతా బలాగాలు మోహరించడం వల్ల హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సీఎం నివాసానికి ఆప్ నేతలు, పెద్ద సంఖ్యలో ఆప్ కార్యకర్తలు తరలివస్తున్నారు. పలువురు కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.