Drugs Seized in Gujarat :దేశంలో మరో అతిపెద్ద డ్రగ్ రాకెట్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఛేదించింది. భారత్‌లోకి అక్రమంగా మాదక ద్రవ్యాలు సరఫరా చేయాలనుకున్న పాకిస్థానీయుల కుట్రల్ని భగ్నం చేసింది. NCB, గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్, ఇండియన్ కోస్ట్‌గార్డ్ సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో రూ.480 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్‌లోని పోరుబందర్ తీరంలో నౌక నుంచి వాటిని సీజ్ చేశారు. పాకిస్థాన్‌కు చెందిన ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్ సరఫరాకు వీరు వినియోగించిన నౌక భారత్‌కు చెందినదిగా గుర్తించారు. దిల్లీ, పంజాబ్‌లకు మత్తు పదార్థాలు స్మగ్లింగ్ చేసేందుకు నిందితులు యత్నించినట్లు అధికారులు పేర్కొన్నారు. నెల రోజుల వ్యవధిలోనే గుజరాత్ తీరంలో ఈ స్థాయిలో డ్రగ్స్‌ను పట్టుకోవడం ఇది రెండోసారి.
రూ.480 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత- పాకిస్థాన్ కుట్ర భగ్నం - drugs seized in gujarat
Drugs Seized in Gujarat : గుజరాత్‌లోని పోరుబందర్ తీరంలో భారీ స్థాయిలో మాదక ద్రవ్యాలను ఎన్‌సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. NCB, గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్, ఇండియన్ కోస్ట్‌గార్డ్ సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో రూ.480 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను అధికారులు పట్టుకున్నారు.
Published : Mar 12, 2024, 9:52 PM IST
3,300 కిలోల డ్రగ్స్ సీజ్
Coast Guard Drug Bust :ఇటీవల అరేబియా సముద్రంలో భారీ అంతర్జాతీయ స్మగ్లింగ్ రాకెట్‌ను భారత నౌకాదళం ఛేదించింది. పోర్‌బందర్‌లో భారత నౌకా దళం, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) సంయుక్తంగా భారీ ఆపరేషన్ నిర్వహించి 3,300 కిలోల డ్రగ్స్‌ను సీజ్ చేశాయి. ఈ డ్రగ్స్‌ను ఇరాన్, పాకిస్థాన్‌ల నుంచి భారత్‌కు తరలిస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. నౌకలో 3,300 కిలోల డ్రగ్స్‌ను తరలిస్తుండగా పట్టుకున్నామని, వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో వేల కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో అయిదుగురిని అరెస్ట్ చేశామని, అందులో నలుగురు ఇరాన్ దేశస్థులు ఉన్నారని తెలిపారు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ రూ.వెయ్యి కోట్లకుపైనే ఉంటుందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. అరేబియా సముద్రంలో అంతర్జాతీయ సరిహద్దు రేఖ వద్ద ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు ఆయన చెప్పారు. సీజ్ చేసిన డ్రగ్స్‌లో 3089 కేజీలు చరాస్, 158 కేజీలు మెథాంఫెటమైన్, 25 కేజీలు మార్ఫైన్ ఉన్నట్లు ఇండియన్ నేవీ తెలిపింది. పరిమాణం పరంగా ఈ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడటం ఇదే తొలిసారని పేర్కొంది.