ETV Bharat / state

అత్యాచారం కేసులో అరెస్టై జైలుకు - గుండెపోటుతో రిమాండ్ ఖైదీ మృతి - REMAND PRISONER DIED

జగిత్యాల జిల్లా సబ్ జైల్‌లో గుండెపోటుతో మృతి చెందిన రిమాండ్‌ ఖైదీ - 15 రోజుల క్రితం అత్యాచారం కేసులో అరెస్టయి రిమాండ్‌ ఖైదీగా ఉన్న మృతుడు

PRISONER DIED IN JAGTIAL SUB JAIL
Remand Prisoner Died by Heart Attack (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 19, 2024, 1:48 PM IST

Remand Prisoner Died by Heart Attack : జగిత్యాల జిల్లా సబ్‌ జైలులో రిమాండ్‌ ఖైదీ గుండెపోటుతో మృతి చెందాడు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం రామన్నపేటకు చెందిన క్యాతం మల్లేశం, 15 రోజుల క్రితం అత్యాచారం కేసులో రిమాండ్ ఖైదీగా జగిత్యాల సబ్‌ జైలులో చేరాడు. ఈరోజు తెల్లవారుజామున మల్లేశం గుండెపోటుతో ఇబ్బంది పడటంతో అధికారులు సబ్‌ జైలు నుంచి హుటాహుటిన జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే మల్లేశం మృతిపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సిబ్బంది నిర్లక్ష్యం చేయటంతోనే మృతి చెందాడని ఆరోపించారు. నిందితుడు మల్లేశంకు ఇప్పటికే బైపాస్‌ సర్జరీ కాగా, మరోసారి గుండెపోటు రావటంతో మృతి చెందినట్లు జైలు అధికారులు తెలిపారు.

చంచల్​ గూడ జైలులో రిమాండ్ ఖైదీ మృతి - పోలీసులపై మృతుడి కుమారుడి అనుమానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.