Muttiah Muralitharan On Ashwin : టీమ్ఇండియా సీనియర్ ప్లేయర్ అశ్విన్ రిటైర్మెంట్పై శ్రీలంక స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరణ్ స్పందించాడు. అశ్విన్ తన కెరీర్లో ఎంతో సాధించాడని ప్రశంసించాడు. టెస్టుల్లో 500 వికెట్లు పడగొట్టడం అంటే ఆషామాషీ విషయం కాదని అన్నాడు. అలాగే అతడు భవిష్యత్ తరాలకు స్ఫూర్తి అని కొనియాడాడు. అశ్విన్ తన కెరీర్‌ను బ్యాటర్‌గా ప్రారంభించాడని ఈ సందర్భంగా గుర్తు చేశాడు.
'అశ్విన్ బ్యాటర్‌గా తన కెరీర్ ప్రారంభించాడు. బ్యాటింగ్‌తోపాటు అప్పుడప్పుడు పార్ట్‌టైమ్ బౌలర్‌గా ఉండేవాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌లో ఆశించిన స్థాయి ప్రదర్శన ఉండకపోవడం వల్ల బౌలింగ్ వైపు దృష్టి మళ్లించాడు. అప్పుడు అతడు తీసుకున్న ఆ నిర్ణయానికి నిజంగా హ్యాట్సాఫ్. ఎంతో కష్టపడి 500 టెస్టు వికెట్లు సాధించడం అంత ఈజీ కాదు' అని మురళీధరన్ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
'నా కెరీర్ చివరి దశలో ఉన్నప్పుడు అశ్విన్ అరంగేట్రం చేశాడు. అప్పట్లోనే ఏదో నేర్చుకోవాలన్న తపన అతడిలో చూశాను. నన్ను సలహాలు, సూచనలు అడిగేవాడు. తనను తాను మెరుగుపర్చుకోవడానికి ఎంతో కష్టపడ్డాడు. ఆటపై ఆసక్తి, కొత్తగా నేర్చుకోవాలన్న తపనే అతడిని అందరికంటే ప్రత్యేకంగా నిలబెట్టింది. బ్యాటర్‌గా వచ్చి, భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో ప్లేయర్‌గా ఎదిగి రిటైర్ అవ్వడం గొప్ప ఘనత. అశ్విన్‌ను చూసి నేడు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్, టీమ్ఇండియా గర్వపడుతుంది. సెకండ్ ఇన్నింగ్స్ (వ్యక్తిగత జీవితం ఉద్దేశించి)లో అతడికి మరిన్ని విజయాలు దక్కాలని ఆశిస్తున్నా' అని మురళీధరణ్ తెలిపాడు.
కాగా, 106 టెస్టుల్లో అశ్విన్ 537 వికెట్లు, 3503 పరుగులు చేశాడు. ఇందులో6 సెంచరీలు ఉన్నాయి. ఈ క్రమంలో భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌గా నిలిచాడు. 619 వికెట్లతో ఈ జాబితాలో మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే టాప్‌లో ఉన్నాడు. ఇక 116 వన్డేల్లో 156, 65 టీ20ల్లో 72 వికెట్లు పడగొట్టాడు. డొమెస్టిక్ క్రికెట్ ఐపీఎల్లో అశ్విన్ 180 వికెట్లు కూల్చాడు.
రవిచంద్రన్ అశ్విన్ టాప్ 10 రికార్డ్స్ ఇవే
ఆ పనితో కుంబ్లే, ధోనిని గుర్తు చేసిన అశ్విన్ - ఆస్ట్రేలియాలో వాళ్లూ ఇలానే చేశారుగా!