Doberman Blood Donation : అన్ని దానాల్లోకెల్లా రక్తదానం గొప్పదని అంటారు. ఒక మనిషి ప్రాణాలను నిలపడానికి మరో మనిషి రక్తదానం చేస్తుండటం గురించి మనకు తెలుసు. కానీ కర్ణాటకలోని కొప్పల్‌లో ఇందుకు భిన్నమైన ఓ ఘటన ఇటీవల జరిగింది. ఓ కుక్క ప్రాణాలను కాపాడేందుకు మరో శునకం రక్తదానం చేసింది.
ఆ కుక్కకు హెమోగ్లోబిన్ లోపం
కొప్పల్‌లో ఓ వ్యక్తి లాబ్రడార్ జాతికి చెందిన కుక్కను పెంచుకుంటున్నాడు. అయితే ఆ శునకం హెమోగ్లోబిన్ లోపంతో బాధపడుతోంది. దీని కారణంగా దాని ఆరోగ్యం చాలా దెబ్బతింది. ఈ నేపథ్యంలో వెటర్నరీ డాక్టర్‌కు లాబ్రడార్ జాతి కుక్కను చూపించగా, సేమ్ బ్లడ్ గ్రూప్ కలిగిన మరో కుక్క రక్తాన్ని ఎక్కిస్తేనే దాని ప్రాణాలను నిలుపగలుగుతామని తేల్చి చెప్పారు.
దీంతో కొప్పల్లోనే డాబర్‌మన్ జాతి కుక్కలను పెంచుకుంటున్న మరో ముగ్గురు వ్యక్తులను డాక్టర్ సంప్రదించారు. లాబ్రడార్ జాతి కుక్క ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యను వివరించి, శాంపిల్ మ్యాచ్ అయితే వారి కుక్కలతో రక్తదానం చేయించాలని కోరారు. ఇందుకు డాబర్‌మన్ జాతి కుక్కల యజమానులు ఒప్పుకున్నారు.