Chiranjeevi Nani Movie : మెగాస్టార్ చిరంజీవి తాజా తన ఫ్యాన్స్‌కు ఓ స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఓ యంగ్ డైరెక్టర్ కథకు ఆయన రీసెంట్గా ఓకే చెప్పారు. గతంలో ఈ రూమర్స్ తెగ ట్రెండ్ అవ్వగా, ఇప్పుడు వాటిని నిజం చేస్తూ ఓ అధికారిక అనౌన్స్మెంట్ వచ్చింది. అయితే ఇందులో ఆసక్తికర అంశం ఏంటంటే ఈ చిత్రానికి సమర్పకుడిగా నేచురల్ స్టార్ నాని వ్యవహరిస్తున్నారు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో కాదు 'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెల. తాజాగా ఈ విషయాన్ని తెలియజేస్తూ నాని సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.
"ఆయన్ను చూసి ఇన్స్పైర్ అవుతూనే నేను ఎదిగాను. ఆయన సినిమాల కోసం గంటల తరబడి క్యూలైన్‌లలో వెయిట్ చేశాను. ఆఖరికి నా సైకిల్‌ను కూడా పోగొట్టుకున్నాను. ఆయన మాకు ఒక వేడుక. ఇప్పుడు ఆయన్నే నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. భూమి గుండ్రంగా ఉంటుంది అంటే ఇదేనేమో. మెగాస్టార్ చిరంజీవిని మరింత కొత్తగా చూపించడానికి మేమెంతో వేచి చూస్తున్నాం. నా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో ఆ కల నిజం కానుంది" అని నాని ఓ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. దానికి చిరుతో శ్రీకాంత్, నాని దిగిన ఫొటోను జత చేశారు.
— Nani (@NameisNani) December 3, 2024
ఇదిలా ఉండగా, చేతులకు రక్తం కారుతున్న ఓ పోస్టర్‌ను షేర్ చేసి "హింసలోనే అతడు తన శాంతిని వెతుక్కున్నాడు" అంటూ ఓ పవర్ఫుల్ క్యాప్షన్‌ను జోడించారు. అనానిమస్ ప్రొడక్షన్స్, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై ఈ మూవీ తెరకెక్కనుంది. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల, నాని కాంబోలో 'ది ప్యారడైజ్' అనే సినిమా రూపొందుతోంది. దీని తర్వాత చిరు ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాదే ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని సినీ వర్గాల మాట.
I grew up inspired by him
— Nani (@NameisNani) December 3, 2024
I stood in the lines for hours everytime
I lost my cycle
I celebrated him
Now I PRESENT HIM
It’s a full circle 🧿@KChiruTweets
UNLEASHING THE MEGASTAR MADNESS WE HAVE BEEN WAITING FOR.
With my boy who dreamt this @odela_srikanth @Unanimousprod… pic.twitter.com/TdtY5XnTUX
ఇక చిరు ప్రస్తుతం 'విశ్వంభర' షూటింగ్లో బిజీగా ఉన్నారు. అషికా రంగనాథ్, త్రిష, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, కునాల్ కపూర్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించనున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, ప్రమోద్, వంశీ కలిసి నిర్మిస్తున్నారు. సోషియో ఫాంటసీ జానర్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే వచ్చిన టీజర్ కూడా ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై అంచనాలు పెంచాయి.
'ఈ బొమ్మను నువ్వు వైజాగ్‌లో ఆడించాలి' ఉత్తరాంధ్ర స్లాంగ్‌లో అభిమానిని ఆటపట్టించిన చిరు!
అప్పుడు 'దసరా', ఇప్పుడు 'ది ప్యారడైజ్'- నాని, శ్రీకాంత్ మూవీ టైటిల్ ఫిక్స్