Gold Rate Today December 4th 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. మంగళవారం 10 గ్రాముల బంగారం ధర రూ.78,600 ఉండగా, బుధవారం నాటికి రూ.70 పెరిగి రూ.78,670కు చేరుకుంది. కిలో వెండి ధర మంగళవారం రూ.91,500 ఉండగా, బుధవారం నాటికి రూ.1,182 పెరిగి రూ.92,682కు చేరింది.
- Gold Price In Hyderabad December 4th 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.78,670గా ఉంది. కిలో వెండి ధర రూ.92,682గా ఉంది.
- Gold Price In Vijayawada December 4th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.78,670గా ఉంది. కిలో వెండి ధర రూ.92,682గా ఉంది.
- Gold Price In Visakhapatnam December 4th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.78,670గా ఉంది. కిలో వెండి ధర రూ.92,682గా ఉంది.
- Gold Price In Proddatur December 4th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.78,670గా ఉంది. కిలో వెండి ధర రూ.92,682గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price December 4th 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేట్లు భారీగా తగ్గాయి. మంగళవారం ఔన్స్ గోల్డ్ ధర 2,647 డాలర్లుగా ఉండగా, బుధవారం నాటికి 3 డాలర్లు తగ్గి 2,644 డాలర్లకు చేరింది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 30.98 డాలర్లుగా ఉంది.
స్టాక్ మార్కెట్ అప్డేట్స్
Stock Market Updates December 4th 2024 : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలకు తోడు ఈ వారంలో వెలువడబోయే ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలపై దృష్టిపెట్టిన మదుపర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సెన్సెక్స్ 119 పాయింట్ల లాభంతో 80,964 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 42 పాయింట్ల లాభంతో 24,498 వద్ద కొనసాగుతోంది.
- లాభాల్లో ఉన్న స్టాక్స్- భారత్ ఎలక్ట్రానిక్స్, అపోలో హాస్పిటల్స్, ట్రెంట్, ఎన్టీపీసీ, ఐటీసీ
- నష్టాల్లో ఉన్న స్టాక్స్- వర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, సిప్లా, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు
రూపాయి విలువ
Rupee Value Today December 4th 2024 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 8 పైసలు పతనమైంది. ప్రస్తుతం డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయి 84.68 వద్ద ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol And Diesel Prices December 4th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.39గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.