South Central Railway On Sabarimala Devotees : శబరిమల వెళ్లే యాత్రికుల డిమాండ్ దృష్ట్యా జోన్ పరిధిలోని పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నామని ద.మ.రైల్వే తెలిపింది. సురక్షిత ప్రయాణం కోసం ప్రయాణికులు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. పూజా విధానంలో భాగంగా కొందరు రైలు బోగీల్లో కర్పూరం వెలిగించడం, హారతి ఇవ్వడం, అగరొత్తులు వెలిగించడం చేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. రైళ్లలో, రైలు ప్రయాణ ప్రాంగణాల్లో మండే స్వభావం ఉన్న పదార్థాలతో ప్రయాణించడంపై నిషేధం ఉందని ఏ రూపంలో అయినా వెలిగించొద్దని విజ్ఞప్తి చేసింది. అగ్ని ప్రమాదాలకు బాధ్యులైనవారికి రైల్వేచట్టం-1989 ప్రకారం మూడు సంవత్సరాల వరకు జైలుశిక్ష, జరిమానా ఉంటుందని తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
అయితే అయ్యప్ప భక్తులు భారీగా శబరిమళ వెళ్తుండటంతో రైళ్లన్నీ నిండిపోయాయి. దీంతో యాత్రికుల డిమాండ్ దృష్ట్యా ద.మ.రైల్వే ప్రత్యేక రైళ్లను నడిపిస్తుంది. తెలంగాణ నుంచి కాచిగూడ - కొట్టాయం - కాచిగూడ మధ్య డిసెంబర్ 5 నుంచి 27 వరకు ప్రతి గురు, శుక్రవారాల్లో ఈ స్పెషల్ రైళ్లు నడవనున్నాయి. కాచిగూడ - కొట్టాయం (07133) రైలు డిసెంబర్ 5, 12, 19, 26 తేదీల్లో (ప్రతి గురువారం) మధ్యాహ్నం 3.40 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్లో బయల్దేరి శుక్రవారం సాయంత్రం 6.50 గంటలకు కొట్టాయం చేరుకోనుంది.
డిసెంబర్ 6, 13, 20, 27 తేదీల్లో ప్రతి శుక్రవారం స్పెషల్ ట్రైన్ (07134) రాత్రి 8.30 గంటల సమయంలో కొట్టాయంలో బయల్దేరి మరుసటి రోజు (శనివారం ) రాత్రి 11.40 గంటలకు కాచిగూడ వస్తుంది. మరోవైపు హైదరాబాద్ కొట్టాయం - సికింద్రాబాద్ ప్రత్యేక రైళ్లను డిసెంబర్ 3 నుంచి జనవరి 1 వరకు ప్రతి మంగళ, బుధవారాల్లో కొనసాగనున్నాయి. హైదరాబాద్ - కొట్టాయం (07135) ప్రత్యేక రైలు మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు బుధవారం సాయంత్రం 4.10 గంటలకు కొట్టాయం స్టేషన్కు చేరుకుంటుంది. అలాగే, కొట్టాయం - హైదరాబాద్ స్పెషల్ ట్రైన్ (07136) బుధవారం సాయంత్రం 6.10 గంటలకు కొట్టాయంలో మొదలయి మరుసటి రోజు రాత్రి 11.45 గంటలకు హైదరాబాద్ చేరుతుంది.
శబరిమల భక్తులకు శుభవార్త - తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్లు
శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్తున్నారా? భక్తులు ఈ హెల్త్ టిప్స్ పాటించాల్సిందే!