Do You Know About Secret Button On Car Seat Belts? :ప్రయాణికుల భద్రతా దృష్ట్యా కంపెనీలు కార్లను రూపొందించేటప్పుడు వివిధ సెక్యూరిటీ ఫీచర్లు ఉండేలా చూసుకుంటాయి. అలాంటి అతిముఖ్యమైన సేఫ్టీ ఫీచర్లలో ఒకటి.. సీటు బెల్ట్(Seat Belt). దీనినే 'సేఫ్టీ బెల్ట్' అని కూడా పిలుస్తారు. కారు నడుపుతున్నప్పుడు లేదా వెహికల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఎల్లప్పుడూ కచ్చితంగా సీటు బెల్ట్ ధరించాలి. ఈ నిబంధనను ప్రభుత్వం, ట్రాఫిక్ పోలీసులు తప్పనిసరి చేశారు. లేదంటే ధరించని వ్యక్తులపై జరిమానా విధించే అవకాశం ఉంటుంది.
అయితే.. సీటు బెల్ట్ ధరించడం వల్ల జరిమానా నుంచి తప్పించుకోవడమే కాదు.. ఏదైనా అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలను రక్షించుకోవడంలో ఇది చాలా బాగా సహాయపడుతుంది. ఇది అందరికీ తెలుసు. కానీ, సీటు బెల్ట్ ధరించేటప్పుడు దానిపై బ్లాక్ కలర్లో ఒక చిన్న బటన్ ఉంటుంది. ఎప్పుడైనా దానిని గమినించారా? అది ఎందుకు ఉంటుందనే ఆలోచన వచ్చిందా? అసలు.. ఇంతకీ, ఆ బటన్ సీటు బెల్ట్‌పై ఎందుకు ఉంటుంది? దాని వల్ల కలిగే ఉపయోగం ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సీటు బెల్ట్‌పై చూడడానికి ఆ బటన్ చిన్నగానే కనిపించొచ్చు. కానీ, అది చాలా ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు నిపుణులు. ఆ బటన్ చేసే పని ఏంటంటే.. బెల్ట్ కట్టు వెనుకకు వెళ్లకుండా అది నిరోధిస్తుందని నిపుణులు చెబుతున్నారు. తద్వారా ప్రయాణికుల భద్రతకు భరోసా కల్పిస్తుందంటున్నారు.