Jaguar Unveils its New Brand Logo: బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ తన కొత్త బ్రాండ్ లోగోను ఆవిష్కరించింది. అయితే ఇందులో గమనించదగ్గ విషయం ఏంటంటే.. ఈ బ్రాండ్ లోగో కేవలం తన ఈవీ వాహనాల కోసం మాత్రమే తీసుకొచ్చింది. త్వరలో ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురానున్న తరుణంలో ఈ లోగోను సరికొత్తగా తీర్చిదిద్దింది. ఈ మేరకు కాపీ నథింగ్ క్యాప్షన్‌లో లోగోకు సంబంధించిన చిన్న క్లిప్‌ను కంపెనీ తన సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా పంచుకుంది.
లోగోతో పాటు కంపెనీ కొత్త బ్రాండ్ ఐడెంటిటీనీ కంపెనీ రివీల్ చేసింది. ఈ కార్ల తయారీ సంస్థ.. కొత్త జాగ్వార్ డివైజ్ మార్క్‌తో పాటు కొత్త 'లీపర్' మ్యాన్‌ఫ్యాక్చర్ మార్క్, మోనోగ్రామ్ లోగోను సరికొత్త డిజైన్‌లో రూపొందించింది. కొత్త డివైస్ మార్క్‌లో 'జాగ్వార్' క్లీన్ అండ్ సింపుల్ ఫాంట్ స్టైల్లో తీర్చిదిద్దారు. అయితే మ్యాన్‌ఫ్యాక్చర్ మార్క్.. క్లాసిక్ లీపర్ లోగోతో వస్తుంది. మోనోగ్రామ్‌ను సరికొత్త ఫాంట్‌తో 'j', 'r' అక్షరాలతో రూపొందించి సర్కిల్లో అమర్చారు. తలకిందులుగా తిప్పినా కూడా ఈ ఆర్టిస్ట్ మార్క్ ఒకేలా కన్పిస్తుంది. ఆ విధంగా దీన్ని డిజైన్ చేశారు.
కొత్త లోగోతో పాటు కొత్త బ్రాండ్ ఐడెంటిటీని జాగ్వార్ అప్‌కమింగ్ ఎలక్ట్రిక్ GT కాన్సెప్ట్‌లో తీసుకురానున్నారు. దీని బోల్డ్ డిజైన్ కచ్చితంగా ప్రతిఒక్కరి దృష్టినీ ఆకర్షిస్తుందని జాగ్వార్ ఒక ప్రకటనలో పేర్కొంది. జాగ్వార్ ప్రస్తుతం ఎఫ్-పేస్ ప్రొడక్షన్‌ను నిలిపివేసింది. ఇది ఈ ఏడాది చివరిలో గ్లోబల్ మార్కెట్స్‌లో సేల్ కానున్న చివరి మోడల్.
జాగ్వార్ ఎలక్ట్రిక్ వాహన విభాగంలో రాణించాలని చూస్తోంది. ఆ దిశగా అడుగులు వేస్తోంది. కంపెనీ 2026 నాటికి 3 విద్యుత్ కార్ల మోడల్స్‌ను తీసుకురావాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త లోగోను లాంచ్ చేసింది. జాగ్వార్ పాత లోగోకి కాస్త భిన్నంగా దీన్ని రూపొందించింది. జాగ్వార్ కొత్త లోగోలో అప్పర్‌కేస్, లోయర్‌కేస్ పదాలతో కలిపి లోగో పేరు 'JaGUar' గా తీర్చిదిద్దారు.
రూ. 8,499కే 5G స్మార్ట్‌ఫోన్- బంపర్ ఆఫర్ అంటే ఇదే.. దీన్ని అస్సలు మిస్ అవ్వొద్దు భయ్యా..!
లగ్జరీ కారు పేరు మార్చిన వోల్వో ఇండియా- పేరుతో పాటు ఇంకేం మార్చారో తెలుసా?