Maharastra Exit Polls 2024 : మహారాష్ట్రలో మరోసారి ఎన్డీఏ కూటమి హవా కొనసాగుతుందని ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేశాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ వైపే మహారాష్ట్ర ఓటర్లు మెుగ్గు చూపినట్లు పేర్కొన్నాయి. బీజేపీ, శిందే శివసేన, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గంతో కూడిన అధికార మహాయుతి కూటమి మళ్లీ అధికారంలోకి రాబోతున్నట్లు ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించాయి. ఈ నెల 23న ఫలితాలు వెలువడనున్నాయి.
- అధికార మహాయుతి కూటమికి 182, మహా వికాస్ అఘాడీ కూటమికి 97, ఇతరులు 9 స్థానాలు వస్తాయని పీపుల్స్ పల్స్ సర్వే అంచనా వేసింది.
- మహాయుతికి 150 నుంచి 170 సీట్లు, మహా వికాస్ అఘాడీకి 110 నుంచి 130 సీట్లు, ఇతరులు 8 నుంచి 10 సీట్లు వస్తాయని ఏబీపీ-మ్యాట్రిజ్ పేర్కొంది.
- మహాయుతి 137 నుంచి 157 స్థానాలు, మహా వికాస్ అఘాడీకి 126 నుంచి 146, ఇతరులు 2 నుంచి 8 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని పీ-మార్క్ అంచనా వేసింది.
- మహాయుతికి 152 నుంచి 160 సీట్లు, మహా వికాస్ అఘాడీకి 130 నుంచి 138 సీట్లు, ఇతరులు 6 నుంచి 8 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉన్నట్లు చాణక్య స్ట్రాటజీస్ అంచనావేసింది.
- మహాయుతికి 122 నుంచి 186, మహా వికాస్ అఘాడీకి 69 నుంచి 121, ఇతరులకు 12 నుంచి 29 సీట్లు వస్తాయని పోల్ డైరీ వెల్లడించింది.
- 128 నుంచి 142 స్థానాల్లో మహాయుతి,125 నుంచి 140 స్థానాల్లో మహా వికాస్ అఘాడీ, 18 నుంచి 23 స్థానాల్లో ఇతరులు విజయం సాధించే అవకాశం ఉన్నట్లు లోక్‌షాహీ మరాఠీ రుద్ర సర్వే తెలిపింది.
- మహాయుతికి 150 నుంచి 167 సీట్లు, మహా వికాస్ అఘాడీకి 107 నుంచి 125 సీట్లు, ఇతరులుకు 13 నుంచి 14 సీట్లు వస్తాయని టైమ్స్‌నౌ-జేవీసీ అంచనా వేసింది.
Maharashtra Exit Polls 2024
పీపుల్స్ పల్స్
- బీజేపీ+ 182
- కాంగ్రెస్+ 97
- ఇతరులు 9
ఏబీపీ-మ్యాట్రిజ్
- బీజేపీ+ 150-170
- కాంగ్రెస్+ 110-130
- ఇతరులు 8-10
పీ-మార్క్
- బీజేపీ+ 137-157
- కాంగ్రెస్+ 126-146
- ఇతరులు 2-8
చాణక్య స్ట్రాటజీస్
- బీజేపీ+ 152-160
- కాంగ్రెస్+ 130-138
- ఇతరులు 6-8
పోల్ డైరీ
- బీజేపీ+ 122-186
- కాంగ్రెస్+ 69-121
- ఇతరులు 12-29