ETV Bharat / state

షాపు యజమాని బంగారం శుద్ధి చేయమని పంపిస్తే - గుమాస్తా ఏం చేశాడో తెలుసా? - MAN ROBBERY GOLD IN AP

యజమానిని మోసం బంగారం చోరీ చేసిన గుమాస్తా - సినీ తరహాలో జరిగిన బంగారం, నగదు చోరీ - కీలక విషయాలు వెల్లడించిన పోలీసులు - ఏపీలోని తాడేపల్లిగూడెంలో జరిగిన సంఘటన

Man Cheating Gold Shop Owner in AP
Man Cheating Gold Shop Owner in AP (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 20, 2024, 7:55 PM IST

Man Cheating Gold Shop Owner in AP : షాపులో యజమాని దగ్గరగా ఎంతో నమ్మకంగా ఉంటున్నట్లు జీవించాడు. దీంతో ఆ బంగారు షాపు యజమానికి గుమాస్తాపై నమ్మకం ఏర్పడింది. ఓనర్​ పని చెబితే ఆ పనిని సక్రమంగా చేసేవాడు. దీంతో యజమానికి ఇంకా ఆ గుమాస్తాపై విపరీతమైన నమ్మకం కలిగింది. ఇలా కొద్ది రోజులు చేసిన తర్వాత తనలోని అసలు మనిషి బయటకు వచ్చాడు. అదును చూసి ఆ సమయం ఎంతో ఓపిగ్గా ఉంటూ సమయం దొరగ్గానే పని కానిచ్చేశాడు. ఇంకా తన మీదికి నేరం రాకుండా ఉండేందుకు కట్టుకథ అల్లడానికి ప్రయత్నించాడు. కానీ చివరికి పోలీసుల రంగ ప్రవేశంతో మొత్తం విషయం బయటకు వచ్చింది. సినీ తరహాలో జరిగిన ఈ బంగారు దొంగతనం ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మహారాష్ట్రకు చెందిన వ్యక్తులు ఏపీలోని తాడేపల్లిగూడెం పట్టణంలో బంగారం శుద్ధి వ్యాపారం చేస్తుండేవారు. వీరి వద్ద అమర్​ అనే వ్యక్తి పనిలో చేరాడు. తమ షాపులో బంగారం శుద్ధి చేసే యంత్రం పాడైపోవడంతో.. రాజమహేంద్రవరంలోని ఓ షాపులో శుద్ధి చేయించేందుకు యజమాని నిర్ణయించారు. గతంలో ఇలాంటి పనులను గుమాస్తా అమర్​కు అప్పగిస్తే నమ్మకంగా వెళ్లి చేయించుకుని తీసుకువచ్చేవాడు. ఈసారి కూడా అదే నమ్మకంతో షాపు యజమాని అమర్​తో 289 గ్రాముల బంగారం, రూ.6.30 లక్షల నగదును ఇచ్చి రాజమహేంద్రవరానికి పంపించారు. అప్పుడు అసలు కథ ప్రారంభమైంది.

ఎంతో నమ్మకంగా ఉన్న అమర్​ అప్పటికే క్రికెట్​ బెట్టింగ్​, ఇతర వ్యసనాల కారణంగా అప్పుల పాలయ్యాడు. గతంలోనే బంగారం శుద్ధి చేయడానికి రాజమహేంద్రవరానికి వెళ్లినప్పుడు అమర్​ మనసులో ఓ మాస్టర్​ ప్లాన్​ తట్టింది. ఆ బంగారాన్ని ఎలాగైనా కొట్టేసి తన అప్పులు తీర్చుకోవాలని పథకం వేశాడు. అయితే ప్లాన్​ భాగంగా తానే బంగారం ఎత్తుకెళ్లిపోతే దొరికిపోతానని భావించి అలా దొరక్కుండా ఉండేందుకు ఏం చేయాలని ఆలోచించి దోపిడీకి పథకం రచించాడు.

ప్లాన్​ అమలు చేసిన అమర్​ : ఈ నెల 13న వ్యాపారులు బంగారం శుద్ధి చేయించేందుకు అమర్​కు బంగారాన్ని, నగదును ఇచ్చారు. అప్పుడు అమర్​ ప్లాన్​ను అమలు చేశాడు. 14వ తేదీన ఉదయం తాడేపల్లిగూడెం నుంచి రాజమహేంద్రవరానికి వెళుతుండగా శెట్టిపేట వద్ద నలుగురు వ్యక్తులు కత్తితో బెదిరించి బంగారం అపహరించారని యజమానికి ఫోన్​ చేసి సమాచారం అందించాడు. దీంతో యజమాని నిడదవోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. పోలీసులకు అమర్​ తీరు అనుమానాస్పదంగా కనిపించడంతో తనని అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారిస్తే దోపిడీ ప్లాన్​ బయటపెట్టాడు. పోలీసులు బంగారం, నగదును స్వాధీనం చేసుకొని.. అమర్​ను అదుపులోకి తీసుకున్నారు.

ఆ SBI బ్యాంకులో 500 మందికి చెందిన బంగారం చోరీ - మీది ఉందో, పోయిందో చెక్ చేసుకోండి

SBI బ్యాంకులో రూ.13కోట్ల బంగారం దోపిడీ- పక్కా స్కెచ్​తో చోరీ- క్లూ దొరక్కుండా కారం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.