తెలంగాణ

telangana

ETV Bharat / bharat

స్వీట్ షాపు స్టైల్​ కరకరలాడే చెగోడీలు - ఇలా చేస్తే రెండు తినే దగ్గర నాలుగు లాగించడం పక్కా! - Crispy Chegodilu Recipe

Crispy Chegodilu Recipe: మీకు సాయంత్రం పూట ఏదైనా టేస్టీ టేస్టీగా స్నాక్ తినాలనిపిస్తోందా? అయితే, మీకోసం మంచి స్నాక్ రెసిపీ తీసుకొచ్చాం. అదే.. కరకరలాడే చెగోడీలు. మంచి రుచిని అందించే స్వీట్ షాపు స్టైల్​ చెగోడీలను ఇంటి వద్దే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి, వీటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

By ETV Bharat Telangana Team

Published : Jun 3, 2024, 3:36 PM IST

How To Make Tasty Chegodilu
Crispy Chegodilu Recipe (ETV Bharat)

How To Make Tasty and Crispy Chegodilu : చాలా మందికి సాయంత్రమైందంటే చాలు.. ఏదో ఒక స్నాక్ ఐటమ్ తినే అలవాటు ఉంటుంది. ఇక ఇప్పుడు సమ్మర్ హాలీడేస్ కాబట్టి పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు. ఈవెనింగ్ కాగానే వారు ఏదో ఒక స్నాక్ అడుగుతుంటారు. ఈ క్రమంలోనే చాలా మంది బయట నుంచి ఏవేవో స్నాక్స్ తెచ్చిపెడుతుంటారు. అలాకాకుండా.. ఇంట్లోనే మీ పిల్లలకు కరకరలాడే చెగోడీలను చేసి పెట్టండి. స్వీట్ షాపుల్లో దొరికే చెగోడీల టేస్ట్​కు ఏమాత్రం తీసిపోవు ఇవి. ఇక సాయంత్రం పూట ఛాయ్​తో పాటు ఈ చెగోడీలను(Chegodilu) తీసుకుంటే ఆ ఫీల్​ వేరే లెవల్​. అంతేకాదు.. వీటిని పిల్లలతో పాటు పెద్దలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. మరి, ఇంకెందుకు ఆలస్యం టేస్టీ టేస్టీగా కరకరలాడే చెగోడీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

చెగోడీల తయారీకి కావాల్సిన పదార్థాలు :

  • మైదా - 250 గ్రాములు
  • వాటర్ - 250 మిల్లీ లీటర్లు
  • నెయ్యి లేదా డాల్డా - 1 టేబుల్ స్పూన్
  • వాము - 1 టీస్పూన్
  • నువ్వులు - 1 టీస్పూన్
  • పసుపు - అర టీస్పూన్
  • ఉప్పు - రుచికి తగినంత
  • నూనె - డీప్​ ఫ్రై కి సరిపడా

క్రిస్పీ పొటాటో లాలీపాప్స్​- ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తినడం పక్కా!

చెగోడీల తయారీ విధానం :

  • ముందుగా స్టౌ మీద ఒక ప్యాన్ తీసుకొని పావు లీటర్ వాటర్ పోసుకోవాలి. అవి కాస్త హీట్ అయ్యాక అందులో నెయ్యి లేదా డాల్డా యాడ్ చేసుకోవాలి. దీనివల్ల చెగోడీలు గుల్లగా వస్తాయి. అలాగే దానిలోనే వాము, పసుపు, నువ్వులు, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
  • నీరు మసులుతున్నప్పుడు అందులో పావు కిలో మైదా పిండి యాడ్ చేసుకోవాలి. అయితే పిండిని వాటర్​లో వేసిన వెంటనే స్టౌ ఆఫ్ చేసి వేడిగా ఉన్నప్పుడే దాన్ని కలుపుకోవాలి.
  • ఇక పిండిని మెత్తగా కలిపిన తర్వాత కొంచెం కొంచెంగా తీసుకుని గుండ్రని ఉండలా చేసి దాన్ని రెండు చేతులతో నలుపుతూ సన్నగా చేసుకోవాలి.
  • అనంతరం.. దాన్ని కావలసిన సైజులో చేసి చెగోడీల్లా చేత్తోనే చుట్టి అంచుల్ని అతికించాలి. ఇలాగే అన్నీ చేసుకొని ఓ క్లాత్​ మీద వేసి అరగంట బయట ఉంచాలి. ఇలా చేయడం వల్ల చెగోడీలు పగలకుండా ఉంటాయి.
  • ఇప్పుడు స్టౌ మీద ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. దానిలో చిటికెడు ఉప్పు వేసుకోండి. దీని వల్ల నూనె ఎక్కువ పీల్చుకోదు. ఇక నూనె వేడి అయ్యాక అందులో ముందుగా చేసి పెట్టుకున్న చెగోడీలను వేసి గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి.
  • అవి పూర్తిగా వేగాయనుకున్నాక తీసి పక్కన పెట్టుకోవాలి. అంతే.. టేస్టీ టేస్టీగా ఉండే కరకరలాడే చెగోడీలు రెడీ!
  • అనంతరం వాటిని నేరుగా తిన్నా బాగుంటాయి లేదా వేడి వేడి ఛాయ్​తో కలిపి తీసుకోవచ్చు.
  • మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇప్పుడే ఈ కరకరలాడే చెగోడీలు ఇంటి వద్ద ట్రై చేయండి.

టీ తాగేటప్పుడు ఈ స్నాక్స్ తింటున్నారా? - జాగ్రత్త, మీ ఆరోగ్యం డేంజర్​లో పడ్డట్లే!

ABOUT THE AUTHOR

...view details