తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఘాటు తక్కువ, ఘుమాయింపు ఎక్కువ - "రెస్టారెంట్ స్టైల్ బటర్ చికెన్" - ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోండి! - Butter Chicken Recipe - BUTTER CHICKEN RECIPE

Butter Chicken Recipe in Telugu : ఇంట్లో చికెన్‌ తెచ్చారంటే.. ఎప్పుడూ పులుసు, ఫ్రై, బిర్యానీ వంటివే ట్రై చేస్తున్నారా? నిత్యం ఒకేలా తింటే బోర్ అనిపిస్తుంది. అందుకే.. ఈ సండే మీ ఇంట్లో "బటర్ చికెన్" రెసిపీ తయారు చేయండి. రెస్టారెంట్​ స్టైల్ లో ఊరించే ఈ రెసిపీ టేస్ట్.. అద్దిరిపోతుందంటే నమ్మాల్సిందే!

How To Make Butter Chicken Recipe
Butter Chicken Recipe (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jul 28, 2024, 10:58 AM IST

How To Make Butter Chicken Recipe :ఈ సండే సరికొత్త చికెన్(Chicken) రెసిపీతో మీ ముందుకు వచ్చాం. అదే.. రెస్టారెంట్ స్టైల్ "బటర్ చికెన్". ఘాటు తక్కువ.. ఘుమాయింపు ఎక్కువగా ఉండే ఈ రెసిపీని ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని అన్నం, రోటీ, పులావ్, నాన్స్.. ఇలా దేనితో తిన్నా టేస్ట్ అద్దిరిపోతుంది. మరి.. బటర్ చికెన్​ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? తయారీ విధానమేంటి? అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బటర్ చికెన్ తయారీకి కావాల్సినవి :

  • అరకిలో - చికెన్
  • 3 టేబుల్​స్పూన్లు - బటర్ (వెన్న)
  • పావు కప్పు - పెరుగు
  • అరకప్పు - మిల్క్ క్రీమ్(మీగడ)
  • 20 - జీడిపప్పు పలుకులు
  • 6 - టమాటాలు
  • 2 - పచ్చిమిర్చి
  • 3 టేబుల్​స్పూన్లు - అల్లం వెల్లుల్లి పేస్ట్
  • 1 టేబుల్​స్పూన్ - నిమ్మరసం
  • 1 టేబుల్​స్పూన్ - జీలకర్ర
  • 1 టీస్పూన్ - పసుపు
  • 1 టీస్పూన్ - జీలకర్ర పొడి
  • 1 టీస్పూన్ - గరంమసాలా
  • 2 చొప్పున - యాలకులు, దాల్చిన చెక్క ముక్కలు
  • తగినంత - నూనె
  • రుచికి సరిపడా - ఉప్పు, కారం
  • కొద్దిగా - కొత్తిమీర తరుగు

తయారీ విధానం :

  • ముందుగా ఈ రెసిపీ కోసం చికెన్​ను బాగా కడిగి.. మసాలాలు పట్టించి కనీసం ఒక గంటపాటు ఫ్రిజ్​లో ఉంచాలి.
  • ఇందుకోసం.. ఒక బౌల్​లో కడిగిన చికెన్ తీసుకుని అందులో పెరుగు, జీలకర్ర పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫ్రిజ్​లో పెట్టుకోవాలి.
  • ఆ గంటలోపు మీరు ఈ రెసిపీకి కావాల్సిన పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోవాలి.
  • అలాగే టమాటాలు కట్ చేసి మిక్సీలో వేసుకొని పేస్ట్​లా చేసుకోవాలి.
  • జీడిపప్పులను నానబెట్టి వాటిని పేస్ట్​లా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అది కాస్త హీట్ అయ్యాక.. ఫ్రిజ్​లో ఉంచిన చికెన్ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • అనంతరం.. స్టౌపై మరో కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి. అది కాస్త వేడి అయ్యాక జీలకర్ర, యాలకులు, దాల్చిన చెక్క వేసుకోవాలి.
  • ఆపై తరిగిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు వేయించుకోవాలి.
  • ఆ తర్వాత అందులో టమాటా పేస్ట్ యాడ్ చేసుకొని కలుపుతూ.. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
  • అనంతరం రుచికి సరిపడా ఉప్పు, కారంతో పాటు జీడిపప్పు పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మంటను లో-ఫ్లేమ్​లో ఉంచి 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి.
  • తర్వాత ఆ మిశ్రమంలో గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి.
  • తర్వాత మీరు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసుకొని కలిపి ఆ మిశ్రమాన్ని మరో 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి.
  • చికెన్ ఉడికిందనుకున్నాక.. కాస్త గరం మసాలా వేసుకోవాలి.
  • ఆ తర్వాత కర్రీ పైన బటర్, మిల్ క్రీమ్ యాడ్ చేసుకొని కొత్తిమీర తరుగు చల్లుకోవాలి.
  • అంతే.. ఘాటు తక్కువ.. ఘుమాయింపు ఎక్కువగా ఉండే రెస్టారెంట్ స్టైల్ బటర్ చికెన్ రెడీ!

"అద్దిరిపోయే నాటుకోడి పులుసు" ఇలా ప్రిపేర్ చేయండి! - యమ్మీ యమ్మీగా జుర్రుకోవాల్సిందే!

జబర్దస్త్ టేస్టీ : మటన్ తలకాయ కూర ఇలా చేస్తే - ప్లేట్​తో సహా నాకేస్తారు!

ABOUT THE AUTHOR

...view details