AAP MLAS Resigned : మరో ఐదు రోజుల్లో దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ జరగనున్న వేళ కేజ్రీవాల్‌కు గట్టి షాక్ తగిలింది. బీజేపీతో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ నెలకొన్న అత్యంత కీలకమైన సమయంలో ఏకంగా 8 మంది ఎమ్మెల్యేలు ఆమ్ ఆద్మీ పార్టీని వీడారు. పార్టీలో తమ ప్రాథమిక సభ్యత్వాలకు రాజీనామా చేస్తున్నట్లు వారు ప్రకటించారు. అంతేకుదా ఎమ్మెల్యేలు భావనా గౌర్, మదన్‌లాల్ కేజ్రీవాల్‌పైనా, ఆప్ పార్టీపైన విశ్వాసం కోల్పోయినట్లు తెలిపారు. ఈ మేరకు ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు లేఖలు పంపారు. 'మీ పట్ల, పార్టీ పట్ల విశ్వాసం కోల్పోయాను. అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నాను. దయచేసి నా రాజీనామాను ఆమోదించండి' అని కేజ్రీవాల్‌కు రాసిన లేఖలో భావనా గౌర్ పేర్కొన్నారు.
రాజీనామా చేసిన వారి వివరాలు ఇవే!
- భావ్నా గౌర్ - పాలం
- బీఎస్.జూన్ - బిజవాసన్
- పవన్ శర్మ - ఆదర్శ నగర్
- మదన్ లాల్ - కస్తూరబా నగర్
- రాజేశ్ రుషి - జనక్‌పురి
- రోహిత్ మెహరౌలియా - త్రిలోకపురి
- నరేశ్ యాదవ్ - మహరౌలి
- గిరీశ్ సోనీ - మాదిపుర్