Stress Management Tips for Board Exam Students :బోర్డ్ ఎగ్జామ్స్ అంటే.. పిల్లల్లో ఆందోళన సహజం. మంచి మార్కులు సాధించాలన్న ఆరాటంతో పిల్లల్లో ఒత్తిడి(Stress)అధికంగా ఉంటుంది. దీంతో కొన్ని సందర్భాల్లో పిల్లలు డిప్రెషన్‌కులోనై.. నేర్చుకున్నదంతా మర్చిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఈ పరిస్థితి రాకుండా కొన్ని టిప్స్ పాటించాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
రిలాక్సేషన్ టెక్నిక్స్ : ఫైనల్ పరీక్షల వేళ పిల్లలు ఎదుర్కొనే ఒత్తిడిని తగ్గించడానికి, తగినంత విశ్రాంతి లభించడానికి కొన్ని రిలాక్సేషన్ టెక్నిక్లను ప్రాక్టీస్ చేయడం చాలా అవసరం. అంటే.. డీప్ బ్రీతింగ్ వ్యాయామాలు, ధ్యానం, యోగా వంటివి డైలీ కాసేపు సాధన చేసేలా చూడండి. ఇవి ఒత్తిడి నుంచి వారి దృష్టి మళ్లించడంలో చాలా బాగా సహాయపడతాయంటున్నారు నిపుణులు.
తగినంత నిద్ర :పరీక్షల వేళ విద్యార్థుల్లో నెలకొనే ఆందోళన, ఒత్తిడిని తగ్గించడానికి తగినంత నిద్ర చాలా అవసరం. ఎందుకంటే చాలా మంది పిల్లలు రాత్రి, పగలు తేడా లేకుండా చదువుతుంటారు. అతిగా చదవడం వల్ల మెదడు అలసిపోతుంది. ఇది నిద్రలేమికి కారణమై మరింత స్ట్రెస్‌కు దారితీస్తుందంటున్నారు నిపుణులు. కాబట్టి తగినంత నిద్ర చాలా అవసరం. ఇందుకోసం.. చదువుకు ఒక నిర్ధిష్ట షెడ్యూల్ కేటాయించుకోవాలి.
వ్యాయామం :చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే టైమ్ లేదనే భావనతో వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ, పరీక్షల వేళ ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో ఇది చాలా బాగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. కాబట్టి మీ పిల్లలు రోజులో కొంతసమయం వ్యాయామం చేసేలా చూడండి. వాకింగ్, రన్నింగ్ లేదా ఏరోబిక్స్ వంటి చేయడం ద్వారా చదువులో నిమగ్నమవ్వడానికి కావాల్సిన శక్తినిస్తాయి. అలాగే స్ట్రెస్‌ను తగ్గించి ఏకాగ్రతను పెంచుతాయి. బాడీని, మనసును ఆరోగ్యంగా ఉంచుతాయి.
Best Ways to Avoid Stress in Children : పిల్లల్ని ఓ కంట కనిపెడుతున్నారా..?