ETV Bharat / offbeat

ఇంట్లోనే రెస్టారెంట్​ స్టైల్​ "చికెన్​ షేర్వా" - ఇలా చేస్తే ఘాటు నషాళానికి ఎక్కాల్సిందే!

చలికాలంలో హాట్​హాట్​గా చికెన్​ షేర్వా.. ఇలా చేస్తే ఎంతో రుచికరంగా రెడీ

How to Make Restaurant Style Chicken Sherva
How to Make Restaurant Style Chicken Sherva (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 3 hours ago

How to Make Restaurant Style Chicken Sherva : చికెన్ షేర్వా పేరు చెబితేనే నోరూరిపోతుంది. ఇక ఈ చలికాలంలో వేడివేడిగా తింటే వచ్చే కిక్కే వేరు. అయితే.. ఈ చికెన్​ షేర్వా చేయాలంటే కష్టమనుకుంటారు చాలా మంది. కానీ సరైన విధానంలో వండితే తక్కువ సమయంలోనే రెస్టారెంట్​ లాంటి షేర్వాను ఇంట్లోనే చేసుకోవచ్చు. దీన్ని చపాతీ, రోటీ, పరోటా, అట్టు, ఇడ్లీలతో తింటే ఆ రుచి వేరు పైగా కాస్త స్పైసీగా చేసుకుంటే ఘాటు నషాళానికి ఎక్కి జలుబు, దగ్గు పోవాల్సిందే. మరి ఈ రెసిపీ కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు:

స్టాక్​ కోసం:

  • చికెన్​ విత్​ బోన్స్​ - పావు కిలో
  • క్యాప్సికం ముక్కలు - పావు కప్పు
  • ఉల్లిపాయ - 1
  • బిర్యానీ ఆకు - ఒకటి
  • మిరియాలు - ఒక స్పూను
  • క్యారెట్ ముక్కలు - అరకప్పు
  • నీళ్లు - ఒకటిన్నర కప్పు

మసాలా పేస్ట్​ కోసం:

  • వేరుశనగ పలుకులు - పావు కప్పు
  • గసగసాలు - 1 టీ స్పూన్​
  • సోంపు - 1 టీ స్పూన్​
  • పచ్చి కొబ్బరి ముక్కలు - అర కప్పు

షేర్వా కోసం:

  • నూనె - సరిపడినంతా
  • అనాస పువ్వు - 1
  • లవంగాలు - 4
  • దాల్చినచెక్క - ఇంచ్​
  • దంచిన యాలకులు - 3
  • బిర్యానీ ఆకు - 1
  • ఉల్లిపాయలు - 2
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • అల్లం వెల్లుల్లి పేస్ట్​ - 2 టేబుల్​ స్పూన్లు
  • చికెన్​ విత్​ బోన్స్​ - 350 గ్రాములు
  • టమాటలు - 2
  • పచ్చిమిర్చి - 3
  • పసుపు - పావు టీ స్పూన్​
  • ధనియాల పొడి - ఒకటిన్నర టేబుల్​ స్పూన్లు
  • కారం - రెండున్నర టేబుల్​ స్పూన్లు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • పుదీనా ఆకులు - 10
  • చికెన్​ మసాలా - 1 టీ స్పూన్​
  • తయారీ విధానం:

చికెన్ షేర్వా రెసిపీ:

  • చికెన్ షేర్వా చేయడానికి ముందుగా చికెన్ స్టాక్​ను ప్రిపేర్​ చేసుకోవాలి. అందుకోసం స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో చికెన్ ముక్కలు, మిరియాలు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయల తరుగు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు వేసి నీళ్లు పోసి మూత పెట్టి లో ఫ్లేమ్​లో గంట పాటు మరిగించండి. ఆ తర్వాత ఉడికిన చికెన్,​ కూరగాయ ముక్కలు తీసి పక్కన పెట్టి.. సూప్​ను అలానే ఉంచండి.
  • ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి పల్లీలు, గసగసాలు వేసి వేయించండి. అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి, పచ్చి కొబ్బరి ముక్కలు, సోంపు వేసి తగినంత నీళ్లు పోస్తూ మెత్తని పేస్ట్ చేసుకోవాలి.
  • ఇప్పుడు అదే కళాయిలో నూనె వేసి అనాసపువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, దంచిన యాలకులు, బిర్యానీ ఆకు వేసి వేయించండి.
  • ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చేదాకా వేయించుకోండి.
  • తర్వాత అందులోనే కొత్తిమీర తరుగును మరో నిమిషం పాటు ఫ్రై చేయాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్​ను కూడా వేసి పచ్చి వాసన పోయేంతవరకు మగ్గించుకోవాలి.
  • అనంతరం చికెన్ ముక్కలను వేసి బాగా కలిపి అందులోని నీరు ఇంకి చికెన్​ ముక్కపై లైట్​ గోల్డెన్ కలర్​ వచ్చే వరకు వేయించుకోవాలి.
  • ఆ తర్వాత అందులోకి టమాట ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, పసుపు, ధనియాల పొడి, కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి..
  • ఆ తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ స్టాక్​ను పోసుకోవాలి. ఓ సారి బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్​ మీద నూనె పైకి తేలేంతవరకు ఉడికించుకోవాలి. సుమారు 20 నిమిషాలు పడుతుంది.
  • ఆ తర్వాత ముందుగానే గ్రైండ్​ చేసుకున్న కొబ్బరి పల్లీల పేస్టును వేసి కలపాలి. ఆ తర్వాత పుదీనా ఆకులు వేసి లోఫ్లేమ్​ మీద నూనె పైకి తేలే వరకు పది నిమిషాలు ఉడికించాలి.
  • ఆ తర్వాత చికెన్ మసాలా వేసి మరో 5 నిమిషాలు ఉడికించాలి. అంతే ఘుమఘుమలాడే రెస్టారెంట్​ స్టైల్​ చికెన్ షేర్వా రెడీ. ఇడ్లీ, దోశ, పూరీ, చపాతీ, పరోటా ఇందులో తిన్నా రుచిగా ఉంటుంది. నచ్చితే మీరూ ఓ సారి ట్రై చేయండి.

ఈ చలిలో మటన్ పాయా.. సూప్ జుర్రేస్తే జిందగీ ఖుష్ అవ్వాల్సిందే!

కూల్​ వెదర్​లో హాట్ హాట్​​గా "మిక్స్​డ్​ వెజ్ బాదం సూప్" - ఇలా చేస్తే టేస్ట్​ అదుర్స్​ - పైగా ఆరోగ్యం బోనస్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.