Ayodhya Ram Temple Donations : అయోధ్య రామ్‌లల్లా విగ్రహా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగవైభంగా జరిగింది. బాల రాముడు ఆలయంలో కొలువుదీరడం వల్ల ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కల సాకరమైంది. ఈ మహత్తరకార్యం సాకరం కావడానికి ఎంతోమంది తమవంతు పాత్ర పోషించారు. దేశవిదేశాల నుంచి రామభక్తులు విరాళాలు సేకరించారు. పేదల నుంచి ధనికుల వరకు, రోజువారి కూలీలు నుంచి పెద్ద పెద్ద వ్యాపారులకు వరకు రామమందిర నిర్మాణానికి విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.
అయోధ్య రామయ్యకు వెల్లువెత్తిన విరాళాలు- 101 కిలోల బంగారం కానుకగా ఇచ్చిన భక్తుడు
Ayodhya Ram Temple Donations : అయోధ్యలో జరిగిన బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ బృహత్ కార్యం సాకారం కావడంలో ఎంతో మంది భక్తులు తమవంతు పాత్ర పోషించారు. రామమందిర నిర్మాణానికి పెద్దఎత్తున విరాళాలు ఇచ్చారు. అందులో ఓ భక్తుడు రూ.68 కోట్లు విరాళంగా ఇచ్చాడు. ఇంతకీ అతడెవరంటే?
Published : Jan 23, 2024, 7:18 AM IST
అత్యధిక విరాళం వజ్రాల వ్యాపారిదే
దేశవ్యాప్తంగా 20 లక్షల మంది కార్యకర్తలు 12 కోట్ల కుటుంబాల నుంచి రెండు వేల కోట్ల రూపాయలు పైగా విరాళాలు సేకరించారని విశ్వహిందూ పరిషత్ లెక్కలు చెబుతున్నాయి. రాములోరికి విరాళాలు అందించిన వారిలో సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి దిలీప్ కుమార్‌వి లాఖి మెుదటిస్థానంలో ఉన్నారు. సుమారు 101 కిలోల బంగారాన్ని అయోధ్య రామమందిరానికి ఆయన కుటుంబం భూరి విరాళం ఇచ్చింది. ప్రస్తుతం మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం రూ.68 వేల ఉంది. అలా చూసుకుంటే దిలీప్ కుటుంబం రామమందిరానికి రూ.68 కోట్లు కానుకగా ఇచ్చినట్టు అవుతుంది. రామ మందిర ట్రస్టుకు వచ్చిన విరాళాల్లో ఇప్పటి వరకు ఇదే అత్యధిక మొత్తం అని తెలుస్తోంది.
16 ఎకరాల పొలాన్ని అమ్మి మరి విరాళం
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మొరారీ బాపూ 11 కోట్ల రూపాయలను రామ మందిరానికి విరాళంగా ఇచ్చారు. గుజరాత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి గోవింద భాయ్ ఢోలాకియా 11 కోట్లు విరాళమిచ్చారు. అమెరికా, కెనడా, బ్రిటన్‌లో నివసిస్తున్న రామ భక్తులు కలిసి 8 కోట్ల రూపాయల విరాళాలను సమకూర్చారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి మందిరం కోసం కోటి రూపాయలు ఇవ్వాలని నిర్ణయించుకుని ఏకంగా తన 16 ఎకరాల పొలాన్ని అమ్మేశాడు. పొలాన్ని అమ్మేయగా ఇంకా 15 లక్షలు తక్కువ కావటం వల్ల ఆ మొత్తాన్ని అప్పు తెచ్చి మరి కోటి రూపాయలు విరాళంగా ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇలా భక్తులు తమ వంతు రామమందిర నిర్మాణానికి విరాళాలు అందించారు.