తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అరవింద్ కేజ్రీవాల్​కు దక్కని ఊరట - ఏప్రిల్​ 23 వరకు జైల్లోనే - Arvind Kejriwal Judicial Custody - ARVIND KEJRIWAL JUDICIAL CUSTODY

Arvind Kejriwal Judicial Custody : మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్​ కేసులో అరవింద్‌ కేజ్రీవాల్​కు జ్యుడీషియల్ కస్టడీని దిల్లీ కోర్టు పొడిగించింది. ఫలితంగా ఆయన ఏప్రిల్​ 23 వరకు జైల్లోనే ఉండనున్నారు.

Arvind Kejriwal Judicial Custody
Arvind Kejriwal Judicial Custody

By ETV Bharat Telugu Team

Published : Apr 15, 2024, 4:11 PM IST

Updated : Apr 15, 2024, 4:50 PM IST

Arvind Kejriwal Judicial Custody : మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్​ కేసులో దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్​కు ఊరట లభించలేదు. ఏప్రిల్ 23 వరకు జ్యుడీషియల్​ కస్టడీని పొడిగిస్తూ దిల్లీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కేజ్రీవాల్ మరికొన్ని రోజులు జైలులోనే ఉండనున్నారు. మరోవైపు కేజ్రీవాల్​ అరెస్ట్​పై వివరణ ఇవ్వలంటూ ఈడీకి నోటీసులు జారీ చేసింది సుప్రీం కోర్టు.

దిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్​కు ప్రత్యేక న్యాయస్థానం విధించిన 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీ సోమవారం ముగియాల్సి ఉంది. దీంతో ప్రస్తుతం తీహాడ్​ జైల్లో ఉన్న కేజ్రీవాల్​ను దిల్లీ కోర్టులోని సీబీఐ, ఈడీ ప్రత్యేక జడ్జి కావేరి బవేజా ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచారు. విచారణ కీలక దశలో ఉందని, మరో 14 రోజులు కస్టడీని పొడిగించాలని ఈడీ కోరింది. ఫలితంగా జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

కేజ్రీవాల్​ అరెస్ట్​పై ఈడీకి నోటీసులు
ఈ మనీలాండరింగ్ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై తక్షణ విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్​పై జస్టిస్​ సంజీవ్​ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ధర్మాసనం ఏప్రిల్‌ 24లోగా వివరణ ఇవ్వాలని ఈడీకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్​ 29 తర్వాత చేపడతామని ధర్మాసనం పేర్కొంది.

'కేజ్రీవాల్‌ను కరుడుగట్టిన నేరస్థుడిలా చూస్తున్నారు'
తిహాడ్​లో జైల్లో ఉన్న అరవింద్​ కేజ్రీవాల్​ను కరుడుగట్టిన నేరస్థుల కంటే దారుణంగా చూస్తున్నారని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఆరోపించారు. జైల్లో ఉన్న కేజ్రీవాల్​ను పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఆప్​ ఎంపీ సందీప్​ పాఠక్​ కలిశారు. 'కరడుగట్టిన నేరగాళ్లకు కూడా అందుబాటులో ఉండే సౌకర్యాలు ఆయనకు అందకపోవడం బాధాకరం. ఆయన చేసిన తప్పేంటి? దేశంలోనే అతి పెద్ద ఉగ్రవాదుల్లో ఒకరిని మీరు పట్టుకున్నట్లుగా వ్యహరిస్తున్నారు. అసలు ప్రధాని మోదీ ఏం కావాలి? పారదర్శకతతో రాజకీయలకు శ్రీకారం చుట్టి, బీజేపీ రాజకీయాలను అంతం చేసిన కేజ్రీవాల్​తో ఇలా వ్యవహరిస్తున్నారు. ఆయనను ఎలా ఉన్నారని అని నేను అడిగితే, నా గురించి మరచిపో, పంజాబ్​లో పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పమని నన్ను అడిగారు. ఎందుకంటే ఆప్​ ఒక క్రమశిక్షణ గల పార్టీ. మేమంతా కలిసి కేజ్రీవాల్​కు అండగా ఉన్నాం. జూన్ ​4న వచ్చే ఫలితాలు తర్వాత ఆప్​ అతి పెద్ద రాజకీయ శక్తిగా అవతరిస్తుంది' అని భగవంత్ మాన్ అన్నారు.

112ఏళ్ల క్రితం ఇదేరోజు 'టైటానిక్'లో మృతి- ఆమె పేరుతో భారత్​లో ఇప్పటికీ విద్యా 'దానం'! - Titanic Disaster Miss Annie story

నెల రోజుల్లో రూ.4,650 కోట్లు జప్తు- ఎన్నికల్లో ఎటుచూసినా డబ్బు, మద్యం- 75 ఏళ్ల రికార్డ్ బ్రేక్ - EC Seized Money Lok Sabha Polls

Last Updated : Apr 15, 2024, 4:50 PM IST

ABOUT THE AUTHOR

...view details