తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ జల్‌బోర్డు కేసులో ఈడీ విచారణకు కేజ్రీవాల్ గైర్హాజరు

Arvind Kejriwal Ed Case : దిల్లీ జల్‌బోర్డుకు సంబంధించిన కేసులోనూ ఈడీ విచారణకు సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ గైర్హాజరయ్యారు. ఈడీ అధికారులు జారీ చేసిన ఆ సమన్లు అక్రమమని ఆరోపించారు.

Arvind Kejriwal Ed Case
Arvind Kejriwal Ed Case

By ETV Bharat Telugu Team

Published : Mar 18, 2024, 12:58 PM IST

Updated : Mar 18, 2024, 2:18 PM IST

Arvind Kejriwal ED Case: దిల్లీ జల్​బోర్డ్​ అవకతవకలకు సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గైర్హాజరయ్యారు. దీనిపై స్పందించిన అమ్​ ఆద్మీ పార్టీ, ఈడీ అధికారులు జారీ చేసిన సమన్లు అక్రమమని, చట్ట వ్యతిరేకంగా జారీ చేశారని ఆరోపించింది. లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలతో కేజ్రీవాల్​ను టార్గెట్​ చేసిందని పేర్కొంది.

'కావాలనే కొత్త కేసులు'
ఈ కేసులో కేజ్రీవాల్​కు ఈడీ సమన్లు జారీ చేయడంపై దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ స్పందించారు. 'అరవింద్ కేజ్రీవాల్ ఇండియా కూటమితో కలిసి ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తే బీజేపీకి ఆటంకాలు వస్తాయని భావిస్తోంది. కేజ్రీవాల్​ను ఎలాగైనా జైలుకి పంపించాలని అనుకుంటుంది. దిల్లీ మద్యం కేసులో బెయిల్ వచ్చే సరికి కొత్త కేసును తీసుకొచ్చారు." అని సౌరభ్ విమర్శించారు.

మరోవైపు ఈడీ విచారణకు కేజ్రీవాల్ కావాలనే గైర్హాజరయ్యారని బీజేపీ నేత హరీశ్ ఖురానా అన్నారు. 'సీఎం కేజ్రీవాల్​కు చట్టం అంటే గౌరవం లేదనే విషయం మరోసారి రుజువైంది. కేజ్రీవాల్​ ఉద్దేశపూర్వకంగానే విచారణ నుంచి తప్పించుకుంటున్నారు' అని హరీశ్ విమర్శించారు.

మరోవైపు జల్​బోర్డ్​లో అవకతవకలకు సంబంధించిన మనీలాండరింగ్​ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే దిల్లీ సీఎం కేజ్రీవాల్​ సోమవారం ఈడీ కార్యాలయానికి వచ్చి విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. అయితే కేజ్రీవాల్ ఈ విచారణకు గైర్హాజరయ్యారు. కాగా, మనీలాండరింగ్‌ చట్టం కింద కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు జారీ చేసిన రెండో కేసు ఇది. ఇప్పటికే దిల్లీ మద్యం కేసులో ఆయనపై అభియోగాలు ఉండటం వల్ల ఈడీ తొమ్మిది సార్లు నోటీసులు జారీ చేసింది.

సత్యేందర్​ జైన్​ బెయిల్​ పిటిషన్ కొట్టివేసిన సుప్రీం కోర్టు
మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్​ నేత సత్యేందర్ జైన్​ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్​ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం మధ్యంతర బెయిల్​పై ఉన్న సత్యేందర్​ను వెంటనే లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది. వారం రోజుల్లోగా లొంగిపోయేందుకు అనుమతించాలంటూ జైన్ తరఫు న్యాయవాది కోరిన అభ్యర్థనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. 2017లో అవినీతి నిరోధక చట్టం కింద సత్యేందర్ జైన్​పై కేసు నమోదయ్యింది. సీబీఐ కేసు ఆధారంగా ఈడీ సైతం ఆయనపై కేసు నమోదు చేసింది. జైన్​కు చెందిన నాలుగు కంపెనీలలో మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ ఆరోపిస్తోంది. ఈ కేసులో జైన్​ను 2023 మే 30న అరెస్ట్ చేసింది.

'ఎలక్టోరల్ బాండ్ల వివరాలు ఇవ్వడంలో సెలక్షన్ వద్దు- అప్పట్లోగా మొత్తం సమాచారం అందించాల్సిందే'

పెళ్లికి వెళ్లి వస్తున్న కారు, ట్రాక్టర్​ ఢీ- ముగ్గురు చిన్నారుల సహా 9మంది మృతి

Last Updated : Mar 18, 2024, 2:18 PM IST

ABOUT THE AUTHOR

...view details