తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లోక్‌సభ ఎన్నికల బరిలో ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్! జైలు నుంచే పోటీ! - Lok Sabha Elections 2024 - LOK SABHA ELECTIONS 2024

Amritpal Singh contest in Lok Shaba polls : లోక్​సభ ఎన్నికల్లో ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్​పాల్ సింగ్ పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. జైల్లో నుంచే ఎన్నికల బరిలో దిగనున్నారని అమృత్​పాల్ సింగ్ తరపు న్యాయవాది తెలిపారు.

Amritpal Singh contest in Lok Shaba polls
Amritpal Singh contest in Lok Shaba polls

By ETV Bharat Telugu Team

Published : Apr 25, 2024, 9:11 AM IST

Amritpal Singh Contest In Lok Shaba polls : ఖలిస్థానీ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్​ దే చీఫ్ అమృత్​పాల్ సింగ్ ఈ లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నాడని తరఫున న్యాయవాది రాజ్​దేవ్ సింగ్ ఖల్సా తెలిపారు. అది కూడా జైలు నుంచే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగనున్నారని రాజ్​దేవ్ పేర్కొన్నారు.

అమృత్​పాల్ ప్రస్తుతం అసోంలోని దిబ్రూగఢ్ జైల్లో ఉన్నాడు. అమృత్​పాల్​ను కలిసేందుకు బుధవారం తాను జైలుకు వెళ్లినప్పుడు లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని అమృత్​పాల్ చెప్పినట్లు రాజ్​దేవ్ పేర్కొన్నారు. ఏ పార్టీ తరఫున కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా పంజాబ్​లోని ఖదూర్ సాహిబ్​ లోక్​సభ నియోజకవర్గం నుంచి అమృత్​పాల్​ పోటీ చేస్తారని వెల్లడించారు.

ఈ విషయంపై అమృత్​పాల్ సింగ్ తండ్రి టార్సెమ్​ సింగ్ స్పందించారు. తన కుమారుడు ఇంతకుముందు రాజకీయాల్లో చేరేందుకు ఆసక్తి చూపలేదని తెలిపారు. జైల్లో ఉన్న తన అమృత్​పాల్​ను కలిశాకే ఈ విషయంపై మాట్లాడతాని చెప్పారు.
ఇదిలా ఉండగా, ఖదూర్​ సాహిబ్​ నియోజకవర్గానికి చివరి విడతలో జూన్ ​1న పోలింగ్ జరగునుంది. పంజాబ్​లో ఉన్న 13 లోక్​ సభ స్థానాలకు ఒకే సారి ఎన్నికలు జరగనున్నాయి.

అమృత్​పాల్​ తల్లి అరెస్ట్​
అమృత్​పాల్​ సింగ్​ను గతేడాది ఏప్రిల్​లోనే పంజాబ్​లోని మోగా జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. అమృత్‌పాల్‌పై నేషనల్‌ సెక్యూరిటీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి అరెస్ట్​ చేశారు. ఆ తర్వాత అసోంలోని దిబ్రూగఢ్ జైలుకు తరలించారు. అయితే తన కుమారుడిని అసోం జైలు నుంచి పంజాబ్​ జైలుకు తరలించాలని అమృత్​పాల్ సింగ్ తల్లి బల్వీందర్​ కౌర్‌ డిమాండ్ చేశారు. అమృత్​పాల్​తో పాటు అరెస్టైన మరికొంతమంది ఖైదీల కుటుంబ సభ్యులతో కలిసి కౌర్​ ర్యాలీ చేపట్టేందుకు ప్రయత్నించారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా బల్వీందర్​ కౌర్​ను పోలీసులు అరెస్టు చేశారు.

ఎవరీ అమృత్​పాల్?
ఏడాది క్రితం వరకు అమృత్​పాల్ అనామకుడు. ఎవరికీ తెలియని ఓ సాధారణ వ్యక్తి. కనీసం తలపాగా కూడా ధరించకుండా మోడ్రన్ లైఫ్​స్టైల్​ను అనుసరించేవాడు. తన బంధువుల రవాణా బిజినెస్​లో మద్దతుగా ఉండేందుకు దుబాయ్​కు వెళ్లాడు. సాధారణ యువకుల్లాగే సోషల్ మీడియాలో అధిక సమయం గడిపేవాడు. కానీ, వారిస్ పంజాబ్ దే వ్యవస్థాపకుడు, నటుడు దీప్​ సిద్ధూ మరణం అమృత్​పాల్ జీవితాన్ని మార్చేసింది. దీప్​ సిద్ధూ అనుచరులకు మార్గదర్శనం చేసే వారు లేకపోయారు. దీంతో ఈ అవకాశాన్ని తెలివిగా అందిపుచ్చుకున్నాడు అమృత్​పాల్. కొద్దిరోజులకే తనను తాను వారిస్ పంజాబ్ దే సంస్థకు అధినేతగా ప్రకటించుకున్నాడు. మొదట్లో అమృత్​పాల్ కుటుంబ సభ్యులు ఇందుకు అనుమతించలేదు. కానీ కొద్ది సమయంలోనే అమృత్​పాల్ బాగా పాపులర్ అయ్యాడు. అతడిపై నిఘా పెట్టిన భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అమృత్​పాల్​కు ఐసిస్​తోనూ సంబంధాలు ఉన్నాయని గుర్తించాయి.

'ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణం'- ప్రత్యేక దర్యాప్తు జరిపించాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ - ELECTORAL BONDS ISSUE Supreme Court

ప్రధాని ప్రసంగంపై ఎన్నికల సంఘం చర్యలు?- పని మొదలు! - Lok Sabha Elections 2024

ABOUT THE AUTHOR

...view details