25 Paise Reward For Criminal :సాధారణంగా పరారీలో ఉన్న నేరస్థులను పట్టుకునేందుకు రివార్డులు ప్రకటిస్తారు పోలీసులు. అందులో చిన్నాచితకా నేరగాళ్ల గురించి సమాచారం అందించిన వారికి రూ.వేలల్లో రివార్డులు ఇస్తారు. ఇక పేరు మోసిన నేరచరితులకు ఈ రివార్డు రూ.లక్షల్లో ఉంటుంది. దీనికి పూర్తిగా భిన్నంగా ఓ క్రిమినల్‌పై పావలా(25 పైసలు) రివార్డు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు రాజస్థాన్ పోలీసులు. అయితే ఆ నేరస్థుడు చిన్నాచితకా నేరాలు చేశాడా- అంటే అదీ కాదు. అతడిపై హత్యాయత్నం, దాడి, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదయ్యాయి. మరి ఆ నేరస్థుడికి ఇంత తక్కువ రివార్డు ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది అనే విషయంపై ఎస్పీ స్పష్టత ఇచ్చారు.
పావలా నేరస్థుడు ఇతడే!
భరత్‌పుర్ జిల్లా లఖన్‌పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మఈ గ్రామనికి చెందిన ఖుబీ రామ్ జాట్‌పై(48) హత్యాయత్నం, దాడి, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉల్లంఘన కింద మూడు కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించి ఖుబీ రామ్‌కు ఎన్నిసార్లు సమన్లు పంపినా పోలీస్ స్టేషన్‌కు హాజరు కాలేదు. గత 7-8 నెలలుగా పరారీలో ఉన్నాడు. ఇక లాభం లేదనుకున్న పోలీసులు అతడి కోసం గాలించారు. అయినా ఖుబీ రామ్ ఆచూకీ దొరకలేదు. ఈ నేపథ్యంలో నేరస్థుడిపై రివార్డు ప్రకటించాల్సిందిగా పోలీస్ స్టేషన్ నుంచి సూపరింటెండెంట్ కార్యాలయానికి ప్రతిపాదన వెళ్లింది. దీంతో ఎస్పీ మృదుల్ కచావా నేరస్థుడు ఖుబీ రామ్ జాట్‌పై 25 పైసలు రివార్డు ప్రకటించారు.