నేపాల్‌కు అమెరికా సాయం.. దేశవ్యాప్తంగా ఆందోళనలు, రాళ్ల దాడులు!
🎬 Watch Now: Feature Video
Violent protests in Kathmandu: నేపాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా ఆర్థిక సాయానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలతో కాఠ్మాండూ అట్టుడుకుతోంది. అమెరికా 500 మిలియన్ డాలర్లను (రూ. 3,734 కోట్లకుపైగా) నేపాల్‌కు సాయంగా అందించాలని నిర్ణయించింది. ఒప్పందం ఆమోదం కోసం దీనిని అధికార పక్షం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. సంకీర్ణ ప్రభుత్వంలోని రెండు కమ్యూనిస్ట్ పార్టీలు సహా విపక్షాలు, సాధారణ ప్రజలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ఒప్పందంలోని కొన్ని నిబంధనలతో.. దేశ సార్వభౌమత్వానికే ముప్పు అని ఆరోపిస్తున్నారు. ఆదివారం ఈ నిరసనలు మరింత తీవ్రమయ్యాయి. పార్లమెంటు బయట పోలీసులు, నిరనసకారుల మధ్య ఘర్షణ చెలరేగింది. పోలీసులు వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఇరువర్గాలకు చెందిన పలువురు గాయపడ్డారు.
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST