భర్తను బ్యాటుతో చితకబాదిన భార్య.. వేధిస్తున్నాడని ఫిర్యాదు - Bikaner Latest News
🎬 Watch Now: Feature Video
భర్త వేధింపులు తాళలేక.. భర్తను చితకబాదింది భార్య. రాజస్థాన్ బికనీర్లో ఈ ఘటన జరిగింది. భర్త నిద్రిస్తున్న సమయంలో బ్యాటుతో దాడి చేసింది మహిళ. గాయపడ్డ ఆ వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. జయనారయణ్ వ్యాస్ కాలనీ పోలీస్ స్టేషన్లో భార్యపై కేసు పెట్టారు భర్త తరఫు బంధువులు. మరోవైపు భార్య కూడా తన భర్త వేధిస్తున్నాడని కేసు పెట్టింది. ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన భర్త బంధువులు.. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.