Live Video: డబుల్ డెక్కర్ బస్సు బోల్తా.. మహిళ మృతి.. 50 మందికి గాయాలు - tamilnadu vellore news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-15958494-thumbnail-3x2-collage.jpg)
వేగంగా దూసుకొస్తున్న ఓ డబుల్ డెక్కర్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ క్రమంలో ఓ మహిళ మృతిచెందగా మరో 50 మందికి గాయాలు అయ్యాయి. బ్రేకులు ఫెయిల్ అవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 65 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. మరోవైపు తమిళనాడులోని వెల్లూరులో త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. స్కూటీపై వెళ్తున్న ఇద్దరు మహిళలను లారీ ఢీకొట్టింది. అయితే అదృష్టవశాత్తు మహిళలకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటనలో స్కూటీ చిత్తు అయిపోయింది.