నదిలో కొట్టుకుపోయిన ట్రాక్టర్.. త్రుటిలో తప్పించుకున్న బైకర్ - ఉత్తరాఖండ్ పిథౌరాగఢ్ ధార్చులాలో విరిగిపడిన కొండచరియలు
🎬 Watch Now: Feature Video
హిమాచల్‌ప్రదేశ్ సోలన్ జిల్లాలో గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు ధాటికి నదులు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో బద్ది సమీపంలోని ఓ నదిలో ట్రాక్టర్ కొట్టుకుపోయింది. ఆ వాహనం మీద ముగ్గురు చిక్కుకుపోయారు. ట్రాక్టర్‌తో పాటు నదిలో వారు కొట్టుకుపోయారు. కొంత దూరం వెళ్లాక వాహనం మీద నుంచి దూకి ఒడ్డుకు చేరుకున్నారు. మరోవైపు వరదల ధాటికి రెండు ఇళ్ల మీద కొండచరియలు విరిగిపడ్డాయి. అప్పుడే అటువైపుగా బైక్‌పై వెళ్తున్న వ్యక్తి త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్.. పిథౌరాగఢ్లోని ధార్చులాలో జరిగింది.
Last Updated : Jul 30, 2022, 12:27 PM IST