ట్రాక్టర్లతో 'టగ్ ఆఫ్ వార్'.. ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు.. వీడియో వైరల్! - ప్రమాదకర విన్యాసాలు
🎬 Watch Now: Feature Video
Tractor Rope Jogging: మామూలుగా టగ్ ఆఫ్ వార్ అంటే.. అటు కొందరు ఇటు కొందరు తాడును తమవైపుకు లాక్కుంటూ పోటీ పడుతుంటారు. కానీ కర్ణాటక బెళగావిలో ట్రాక్టర్లతో టగ్ ఆఫ్ వార్ నిర్వహించారు. తాడును రెండు ట్రాక్టర్లకు కట్టి.. ప్రమాదకర రీతిలో పోటీపడ్డారు. భారీ వాహనాన్ని గాల్లోకి లేపుతూ.. రెండు చక్రాలపై ఉంచి సాహసాలు ప్రదర్శించారు ఔత్సాహికులు. అథని తాలుకా చామకేరి గ్రామంలో నిర్వహించిన బీరలింగశ్వేర జాతరలో.. ఇలాంటి పోటీలు ఏర్పాటు చేశారు గ్రామస్థులు. కనీస ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా పందేలు నిర్వహించారని గ్రామ పంచాయతీ అధికారులు, పోలీసులపై విమర్శలు వస్తున్నాయి. అనంతరం.. నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Last Updated : Jul 1, 2022, 6:08 PM IST