నిద్రిస్తున్న భార్యను లేపి, రైలు కిందకు తోసి హత్య - టైన్​ కిందకి భార్యను తోసిన భర్త

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 23, 2022, 4:23 PM IST

ప్లాట్​ఫాంపై నిద్రిస్తున్న తన భార్యను నిద్ర లేపి అతి కిరాతకంగా పట్టాలపైకి తోసేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్​ జిల్లాలో జరిగింది. వాసాయ్​ రైల్వేస్టేషన్​లో సోమవారం ఉదయం సుమారు నాలుగు గంటల సమయంలో ఒక వ్యక్తి నిద్రిస్తున్న తన భార్యను లేపి, అప్పుడే వస్తున్న ఎక్స్​ప్రెస్​ మెయిల్​ ట్రైన్​ కిందకు హఠాత్తుగా తోశాడు. రైలు కింద పడ్డ ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఆ వ్యక్తి ఇద్దరు పిల్లలను తీసుకుని పరారయ్యాడు. ఇదంతా సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. నిందితుడ్ని పోలీసులు ఠానేలో అరెస్టు చేశారు. కుటుంబ కలహాలతోనే ఇలా చేశాడని ప్రాథమికంగా నిర్ధరించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.