ETV Bharat / state

స్కూల్​ ఫీజులు ఏడాదికోసారి పెంచుకోవచ్చు! - విద్యా కమిషన్ సిఫార్సులు - EDUCATION COMMISSION SCHOOL FEES

మూడేళ్లకోసారి ప్రైవేటు స్కూల్స్‌ రుసుములపై సమీక్ష - సౌకర్యాల ఆధారంగా 5 కేటగిరీలుగా స్కూళ్ల విభజన - ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణపై విద్యా కమిషన్‌ సిఫార్సులు

Education Commission Recommendations In Private School Fees
Education Commission Recommendations In Private School Fees (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 6, 2025, 3:20 PM IST

Education Commission Recommendations In Private School Fees : 'తెలంగాణలోని ప్రైవేటు పాఠశాలల్లో ట్యూషన్‌ ఫీజును సంవత్సరానికి ఒకసారి పెంచుకోవచ్చు, వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారంగా ఆ పెంపు శాతాన్ని నిర్ణయించాలి. ఫీజుల నియంత్రణకు నియమించే కమిషన్‌ మూడేళ్లకోసారి ఈ రుసుములను సమీక్షించి సవరిస్తుంది.' ఈ మేరకు తెలంగాణ విద్యా కమిషన్‌ ప్రభుత్వానికి పలు సిఫార్సులు చేసింది. కమిషన్‌ గత నెలలో ఫీజుల నియంత్రణపై ముసాయిదాను ప్రభుత్వానికి అందజేసిన సంగతి తెలిసిందే. దానిపై ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌లోని సీనియర్‌ అధికారులు, ఇద్దరు డీఈవోలు, మరికొందరు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్లు బుధవారం సమావేశమైన చర్చించారు. ముసాయిదాలో చేసిన సిఫార్సులు ఇలా ఉన్నాయి.

మోయలేని భారంగా మారిన ప్రైవేట్ చదువులు - ఫీజుల నియంత్రణ ఎలా ? - Private Schools Fee Increased in Telangana

  • ఫీజుల నియంత్రణకు రాష్ట్రస్థాయి కమిషన్ ఏర్పాటు చేయాలి. ఛైర్మన్‌గా హైకోర్టు లేదా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి లేదా విశ్రాంత ఐఏఎస్‌ అధికారిని నియమించాలని సూచించింది. పాఠశాల విద్యాశాఖలో పని చేసిన విశ్రాంత సంయుక్త సంచాలకుడు, ఛార్డెర్డ్‌ అకౌంటెంట్‌ సభ్యులుగా ఉంటారు.
  • జిల్లా స్థాయిలో కలెక్టర్‌ ఛైర్మన్‌గా జిల్లా రుసుముల నియంత్రణ కమిటీ (టీఎఫ్‌ఆర్‌సీ)లు ఉంటాయి. అవి తమ జిల్లాల పరిధిలోని పాఠశాలల ఫీజులను నియంత్రిస్తాయి. ఒకవేళ డీఎఫ్ఆర్‌సీలు నిర్దేశించిన ఫీజుపై అభ్యంతరాలుంటే రాష్ట్రస్థాయి కమిషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ప్రైవేటు పాఠశాలలను 5 కేటగిరీలుగా విభజించాలి. రాష్ట్రంలో సుమారు 11,500 ప్రైవేటు స్కూల్స్‌ ఉన్నాయి. పాఠశాలకున్న స్థలం, ప్రయోగశాలలు, కంప్యూటర్‌ ల్యాబ్‌, డైనింగ్ హాళ్లు, క్రీడా స్థలం, ఇతర సౌకర్యాల ఆధారంగా కేటగిరీలను నిర్ధారించాలి. తరగతి గదిలో ఒక్కో విద్యార్థికి సగటున 25 చదరపు అడుగుల స్థలం కేటాయించాలి.
  • చివరిది అయిన 5వ కేటగిరికి చెందిన పాఠశాలలు రూ.32 వేల వరకు ఫీజు వసూలు చేసుకునే అవకాశం ఉఁది. కానీ ఆ పాఠశాలకు ఎకరా విస్తీర్ణం ఉండాలి.
  • 2వ కేటగిరీ ఫీజు గరిష్ఠంగా రూ.2 లక్షలలోపు ఉండొచ్చు. మొదటి కేటగిరీ స్కూల్‌కు గరిష్ఠ రుసుం ఇంకా నిర్ణయించలేదు. అందులో ఉండే వివిధ రకాల సౌకర్యాలను బట్టి నిర్ణయిస్తారు. 3,4 కేటగిరీల వివరాలు తెలియాల్సి ఉంది.
  • నిర్దేశించిన ఫీజు కంటే అధికంగా వసూలు చేస్తే విచారణ జరిపి మొదటిసారి రూ.లక్ష జరిమాన విధిస్తారు. రెండోసారి రూ.2లక్షలు, మూడోసారి రూ.5 లక్షల జరిమాన వసూలు చేస్తారు. ఆ తర్వాత కూడా నిబంధనలను అతిక్రమిస్తే ఆ ఫఆఠశాల అనుమతిని రద్దు చేస్తారు.
  • పాఠశాలలు వసూలు చేస్తున్న ఫీజులను వెబ్‌సైట్లో ఉంచాలి. వాటి ఆడిట్‌ నివేదికలను సైతం పబ్లిక్‌ డొమైన్‌లో ఉంచాలి.

Pratidwani : పాఠశాల ఫీజులు... ప్రభుత్వ నియంత్రణ

మీ పిల్లల విద్య, వైద్యం కోసం బాగా ఖర్చు చేస్తున్నారా? ట్యాక్స్‌ బెనిఫిట్స్ పొందండిలా! - Tax Benefits On Children Education

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.