Man Committed Suicide After Whatsapp Status : చనిపోతున్నానని చెప్పి వాట్సాప్ స్టేటస్ పెట్టి యువకుడు మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, ఖమ్మం నగరంలోని ప్రకాశ్‌నగర్ ప్రాంతానికి చెందిన పందిరి లక్ష్మీ ప్రసన్న కుమార్ (18) పదో తరగతి ఫెయిలై ఇంటివద్దే ఉంటున్నాడు. ఏ పనీ చేయకుండా తిరుగుతున్నావని జనవరి 31న తల్లి మందలించింది.
దీంతో మనస్తాపానికి గురైన అతను చనిపోతున్నట్లు స్టేటస్ పెట్టాడు. తర్వాత ఎలుకల మందు తాగాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మత్యువాతపడ్డాడు. మృతుడి సోదరుడు సైదులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మూడో పట్టణ ఏఎస్‌ఐ నాగరాజు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.