అంగన్వాడీ టీచర్‌గా మారిన కేంద్రమంత్రి.. విద్యార్థులకు పాఠాలు - స్మృతి ఇరానీ అంగన్వాడీ పాఠాలు
🎬 Watch Now: Feature Video

Smriti Irani: నిత్యం రాజకీయ వ్యవహారాలతో బిజీగా ఉండే కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ.. కాసేపు అంగన్వాడీ టీచర్‌గా దర్శనమిచ్చారు. ఛత్తీస్‌గఢ్ రాయ్‌పుర్‌లో పర్యటించిన ఆమె.. స్థానిక అంగన్వాడీ స్కూల్‌ను సందర్శించారు. అక్కడ ఉన్న పిల్లలకు కాసేపు పాఠాలు బోధించారు. పాఠశాలలో ఫొటోలతో కూడి ఉన్న పోస్టర్లను చూపిస్తూ పిల్లలకు ప్రశ్నలు కూడా వేశారు. అడిగిన ప్రశ్నలకు పిల్లలు కూడా వెంట వెంటనే సమాధానాలిచ్చారు. వాటికి ఆమె ఎంతో సంతోషించి చప్పట్లు కొట్టారు. త్రివర్ణ పతాకాన్ని చూపిస్తూ ఇది ఎవరి జెండా అని అడగ్గా.. ఓ చిన్నారి అది మన భారత జెండా మేడమ్ అన్ని చెప్పాడు. ఆ సమాధానానికి స్మృతి ఇరానీ మరింత ఆనందపడ్డారు.