నాలా ఉప్పొంగి బ్రిడ్జిపైకి వరద.. కొట్టుకుపోయిన స్కార్పియో.. ముగ్గురు దుర్మరణం - నాగ్‌పుర్ వర్షాలు
🎬 Watch Now: Feature Video
Scorpio Swept Away: భారీ వర్షాలకు నాలా ఉప్పొంగి.. బ్రిడ్జిపైకి వరద ప్రవహించింది. నీరు లోతు అంచనా వేయని స్కార్పియో డ్రైవర్ నిర్లక్ష్యంతో ముందుకు పోనివ్వగా.. నదిలో కొట్టుకుపోయింది. మహారాష్ట్ర నాగ్‌పుర్‌లో జరిగిన ఈ ఘటనలో.. మధ్యప్రదేశ్ బేతుల్‌కు చెందిన ముగ్గురు చనిపోయారు. మరో ముగ్గురిని రక్షించారు. సత్రాపుర్, నందా గ్రామం మధ్య ప్రవహిస్తున్న నాలాకు వరద తాకిడి ఎక్కువై.. ఈ ప్రమాదం జరిగింది. మృతులు నాగ్‌పుర్‌లోని నందగావ్ గోముఖ్‌కు వచ్చారు. మంగళవారం మధ్యాహ్నమే తిరుగుపయనమయ్యారు. ఇంతలోనే ఈ దుర్ఘటన జరిగింది.
Last Updated : Jul 12, 2022, 10:30 PM IST