ప్రతిధ్వని: భవిష్యత్తులో ఐటీ రంగంలో రాబోతున్న మార్పులేంటి ?
🎬 Watch Now: Feature Video
కరోనా కాలంలోనూ ఐటీ రంగం కళకళలాడింది. దేశవ్యాప్తంగా కొవిడ్ వల్ల చాలా రంగాలు కుంటుపడినప్పటికి ఐటీ రంగం మాత్రం సానుకూలంగా ముందుకు కదులుతోంది. ఈ ఏడాదికి సంబంధించి రూ.14.5 లక్షల కోట్లు ఆదాయం వస్తుందని నాస్కామ్ అంచనా వేస్తోంది. ఐటీ కంపెనీలు దాదాపుగా 1.36 లక్షల ఉద్యోగాలను ఇప్పటివరకు ఇవ్వగలిగాయి. అలాగే కొత్త అంకుర సంస్థలు పుట్టుకొస్తున్నాయి. ఐటీ రంగం సానుకూల దృక్పథంతో ముందుకు కదులుతుండడం వల్ల ముందు ముందు.. నియామకాలు పెరుగుతాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో భవిష్యత్తులో ఐటీ రంగంలో రాబోతున్న కొత్త మార్పులేంటి? కొత్త తరహా కోర్సులు, టెక్నాలజీలపై ప్రతిధ్వని చర్చ.