చీపురు పట్టి స్కూల్ బాత్​ రూం క్లీన్ చేసిన మంత్రి- వీడియో వైరల్​ - బాత్ రూం క్లీన్​ మంత్రి

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 19, 2022, 7:50 PM IST

ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాల్లో టాయిలెట్ల అపరిశుభ్రత గురించి వినే ఉంటారు. స్కూళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులను సర్కారు ఎన్నిసార్లు ఆదేశించినా పెద్దగా మార్పు రావడం లేదు. ఈ నేపథ్యంలో స్వచ్ఛత విషయంలో ఆదర్శంగా నిలిచారో మంత్రి. ఒడిశాలో బాలేశ్వర్​ జిల్లాలోని ఖైరా ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన ఆ రాష్ట్ర పర్యటక మంత్రి జ్యోతి ప్రకాష్​ పాణిగ్రాహి.. టాయిలెట్​ క్లీన్​గా లేదని తానే స్వయంగా రంగంలోకి దిగి చీపురు పట్టి క్లీన్ చేశారు. అయితే సాక్షాత్తు రాష్ట్ర మంత్రి బాత్​ రూం క్లీన్​ చేయడం హాట్​ టాపిక్​గా మారింది. అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.