అబ్బుర పరిచే అందాలు... గోదారమ్మ లోగిళ్లు - ప్రకృతి అందాలు
🎬 Watch Now: Feature Video
అబ్బురపరిచే అందాలకు పుట్టినిల్లు గోదావరి పరిసరాలు. మనసుతో చూడాలే గాని అణువణువు అందమే గోదారమ్మకు. సిరుల సవ్వడితో వడివడిగా సాగిపోయే జలాలు... ఉషోదయం, సాయం సంధ్య వేళ పసిడి వర్ణంతో మెరిసిపోయే కెరిటాల హొయలు. గట్టు వెంబడి చెట్టుపై కట్టుకున్న గూళ్లలోంచి వినిపించే పక్షుల కిలకిలరావాలు, ఇసుక తిన్నెలపై చెంగు చెంగున దూకుతున్న జింకల అడుగుల సవ్వడులు, నదిలో పడవల వెంట సాగిపోతున్న నీటిచారికల గురుతులు. ఇలాంటి వన్నీ ప్రకృతి రమణీయతకు తార్కాణాలు. అటువంటి ఆహ్లాదకరమైన దృశ్యాలతో మదిని దోచుకుంటోంది శ్రీరాంసాగర్ జలాశయం వెనక భాగంలోని నందిపేట, నవీపేట, రెంజల్ మండలాల్లో రమణీయ వాతావరణం.