చుట్టు చుట్టు చుక్కలు చూడు, మల్లారెడ్డి డ్యాన్స్ చూడు - minister mallareddy dance video
🎬 Watch Now: Feature Video
Minister malla reddy dance రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి డ్యాన్స్‌లతో పార్టీ కార్యకర్తలలో జోష్ నింపారు. చుట్టు చుట్టు చుక్కలు చూడు... అంటూ పాటకు ఒకవైపు కార్యకర్తలు నృత్యాలు చేస్తుంటే మరోవైపు వాహనంపైనే మంత్రి మల్లారెడ్డి డ్యాన్స్ చేస్తూ ఉత్సాహపరిచారు. మధ్యలో మల్లారెడ్డి డ్యాన్స్ చూడు అన్నట్లుగా అదరగొట్టారు. ఇవాళ మునుగోడులో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో నగరం నుంచి పెద్ద ఎత్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు తమ అనుచరులతో భారీ వాహనాలతో మునుగోడు బహిరంగ సభను ర్యాలీగా బయలుదేరారు. వాహన ర్యాలీతో వెళ్తున్న మంత్రి డిజే పాటలకు నృత్యాలు చేసుకుంటూ హోరెత్తించారు.