ఆయిల్​ ట్యాంకర్​ బోల్తా.. ఎగబడ్డ జనం.. క్యాన్లు, బిందెల్లో నింపుకొని - వంటనూనె కోసం ఎగబడ్డ జనం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 22, 2022, 2:03 PM IST

Updated : May 22, 2022, 2:15 PM IST

Locals Loot Edible Oil: మహారాష్ట్రలోని ముంబయి- అహ్మదాబాద్ హైవేపై ఆయిల్‌ ట్యాంకర్‌ బోల్తాపడింది. శనివారం పాల్ఘర్​ జిల్లా తవా గ్రామం సమీపంలో.. వాహనం అదుపుతప్పి ప్రమాదం జరిగింది. 12 వేల లీటర్ల వంట నూనె రోడ్డుపాలైంది. దీంతో ట్యాంకర్​ నుంచి లీకైన నూనె కోసం అక్కడి జనం ఎగబడ్డారు. బిందెలు, క్యాన్లలో వంటనూనెను నింపుకునేందుకు పోటీపడ్డారు. వారిని నిలువరించడం పోలీసులకు కష్టంగా మారింది. రహదారిపై ట్రాఫిక్ జామ్ కావడంతో.. అధికారులు 3 గంటలపాటు శ్రమించి పరిస్థితిని చక్కదిద్దారు. గుజరాత్​లోని సూరత్​ నుంచి ముంబయికి నూనెను ట్యాంకర్లలో తరలిస్తుండగా అదుపుతప్పి బోల్తాపడింది. ట్యాంకర్​ డ్రైవర్​కు స్వల్ప గాయాలయ్యాయి.
Last Updated : May 22, 2022, 2:15 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.