ప్రాక్టీస్​ సెషన్​లో పల్టీలు కొట్టిన కబడ్డీ ప్లేయర్, తలకు తీవ్ర గాయంతో మృతి - kabaddi player dead news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 16, 2022, 3:36 PM IST

కబడ్డీ ప్రాక్టీస్​ సెషన్​లో ఉత్సాహంతో పల్టీలు కొట్టిన ఓ ప్లేయర్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. తమిళనాడులోని తిరువణ్నామలై జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఆగస్టు 8న అరణిలోని మరియమ్మన్​ ఆలయ ఉత్సవం జరిగింది. అందులో భాగంగా కబడ్డీ పోటీల కోసం స్థానికంగా ఉన్న కె.ఎం.ఎస్ టీమ్​ ప్రాక్టీస్​ చేస్తోంది. ఆ సమయంలో కబడ్డీ ప్లేయర్​ వినోద్​ కుమార్ ఒక్కసారిగా పల్టీలు కొట్టాడు. దీంతో అతడి తలకు బలమైన గాయమై స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే స్థానికులు అతడ్ని అరణి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ తర్వాత అత్యవసర చికిత్స నిమిత్తం చెన్నై ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లినా లాభం లేకుండా పోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం వినోద్​ మృతి చెందాడు. వినోద్​కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.