కుక్కపై డాక్టర్​ పైశాచికం.. తాడుతో కారుకు కట్టేసి, రోడ్డుపై ఈడ్చుకెళ్లి... - కుక్కను హింసించిన డాక్టర్ వీడియో

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 19, 2022, 10:38 AM IST

కుక్క పట్ల అత్యంత అమానవీయంగా ప్రవర్తించిన ప్రముఖ వైద్యుడిపై రాజస్థాన్​ జోధ్​పుర్​ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్లాస్టిక్ సర్జన్​గా పనిచేస్తున్న డాక్టర్​ రజినీశ్​ గాల్వా.. తాడుతో వీధి కుక్కను కారుకు కట్టేసి, డ్రైవ్ చేస్తుండడాన్ని ఇటీవల కొందరు వీడియో తీశారు. కారు వేగంతో సమానంగా పరిగెత్తలేక ఆ శునకం తీవ్ర అవస్థలు పడింది. కాసేపటికి కుక్కకు ఓ కాలు విరిగింది. మరో కాలికి, మెడకు గాయాలయ్యాయి. డాగ్​ హోమ్ ఫౌండేషన్​ ప్రతినిధులు శునకాన్ని రక్షించి, చికిత్స చేయించారు. రజినీశ్​పై ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని రజినీశ్​ను ఆదేశించారు ఎస్​ఎన్​ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డా.దిలీప్ కంచావహ.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.