thumbnail

By

Published : Sep 2, 2022, 7:34 PM IST

ETV Bharat / Videos

బర్త్​డే వేడుకల్లో డాన్స్ చేస్తూ కుప్పకూలిన వ్యక్తి.. అక్కడికక్కడే మృతి

పుట్టినరోజు వేడుకల్లో డాన్స్ చేస్తూ ఓ వ్యక్తి హఠాత్తుగా కుప్పకూలాడు. ఉత్తర్​ప్రదేశ్​లోని బరేలీలో ఈ ఘటన జరిగింది. ప్రేమ్​నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐవీఆర్ఐ సంస్థలో టెక్నికల్ అసిస్టెంట్​గా పనిచేస్తున్న ప్రభాత్ కుమార్(45) తన స్నేహితుడి చిన్నారి బర్త్​డే ఫంక్షన్​కు హాజరయ్యాడు. పార్టీలో పాటలకు హుషారుగా స్టెప్పులేశాడు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా వెనక్కి పడిపోయాడు. ఊపిరి ఆగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.