ప్రియుడితో బైక్పై వెళ్తుందని.. మినీ ట్రక్కుతో ఢీకొట్టిన సోదరుడు - bhopal news
🎬 Watch Now: Feature Video
Honor Attack: తన సోదరి మరో వ్యక్తితో బైక్పై వెళ్తుండటం గమనించాడో వ్యక్తి. కోపంతో రగిలిపోయి.. వారిని ఆపేందుకు యత్నించాడు. కానీ వారు పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహావేశాలకు లోనైన అతడు.. వారు వెళ్తున్న బైక్ను ఓ మినీ ట్రక్కుతో వెంబడించి.. బలంగా ఢీకొట్టాడు. అలాగే 10 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లాడు. అంతటితో ఆగకుండా వాహనం దిగి.. తన సోదరి సహా ఆమెతో ఉన్న వ్యక్తిపై దాడికి దిగాడు. గాయపడ్డ ఇద్దరినీ స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. మధ్యప్రదేశ్ భోపాల్లోని అయోధ్య నగర్లో సోమవారం(ఏప్రిల్ 18) జరిగిందీ ఘటన. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడు అజీం మన్సూరీని అరెస్టు చేశారు పోలీసులు. ట్రక్కు డ్రైవర్ రవిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. సంబంధిత దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.
Last Updated : Apr 21, 2022, 5:09 PM IST