రెస్టారెంట్‌లో పేలిన గ్యాస్ సిలిండర్.. లైవ్ వీడియో - కేరళ గ్యాస్ సిలిండర్
🎬 Watch Now: Feature Video

Gas Cylinder Blasted: కేరళ పండళంలోని ఓ రెస్టారెంట్‌లో గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. తొలుత సిలిండర్ నుంచి గ్యాస్ లీకై.. పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఫలక్ మజ్లిస్ రెస్టారెంట్‌లో ఈ ఘటన జరిగింది. రెస్టారెంట్‌లో పనిచేస్తున్న సల్మాన్, సిరాజుద్దీన్, కన్నన్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో రెస్టారెంట్‌కు భోజనం చేసేందుకు వచ్చిన కస్టమర్లు బయటికి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భారీ పేలుడు ధాటికి రెస్టారెంట్‌లోని వంట సామాగ్రి, కిటికీ తలుపులు అన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు లక్ష రూపాయల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు.