బావిలో పడిన చిరుత.. రాత్రంతా అందులోనే.. చివరకు! - చిరుతను బయటకు తీసిన అటవీ సిబ్బంది
🎬 Watch Now: Feature Video
Leopard Rescued From Well: ప్రమాదవశాత్తు ఓ చిరుత బావిలో పడింది. రాత్రంతా బయటకురాలేక ఆపసోపాలు పడింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అటవీ అధికారులు.. అగ్నిమాపక సిబ్బంది, పోలీసుల సాయంతో బయటకుతీశారు. చిరుత మంగళవారం రాత్రి బావిలోపడగా.. రాత్రంతా అందులోనే ఉన్నట్లు తెలిసింది. బుధవారం ఉదయం అటవీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని నిచ్చెన సాయంతో పులిని బయటకురప్పించారు. తాళ్లను కట్టి నిచ్చెనను బావిలోకి వదలగా.. మెల్లగా పైకివచ్చింది చిరుత. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.