లోన్ తీసుకోవడానికి బ్యాంక్‌కు వచ్చిన రోబో - రోబోలకు ఫెడరల్ బ్యాంక్ సాయం
🎬 Watch Now: Feature Video
రోబోటిక్స్ ఆధారిత అంకురాలకు మరింత మద్దతు ఇచ్చేందుకు ఫెడరల్ బ్యాంక్ ముందుకొచ్చింది. అందులో భాగంగా అసిమోవ్ రోబోటిక్స్ కంపెనీకి ఈ బ్యాంకు రుణం ఇవ్వగా.. అందుకు సంబంధించిన పత్రాలను అందుకోవడానికి ఒక రోబో(సాయాబాట్) నేరుగా బ్యాంకుకు రావడం విశేషం. సాయాబాట్ ప్రస్తుతం ఆరోగ్య సంరక్షణ, రిటైల్, ఆతిథ్య వంటి రంగాల్లో, రోజువారీ పనుల్లో తన సత్తాను చాటుతోంది. కాగా, తొలి దశలో కృత్రిమ మేధపై వినూత్న ఆలోచనలు చేసే కంపెనీలకు సహాయం చేయనున్నట్లు బ్యాంకు తెలిపింది. అత్యుత్తమ ఆలోచనలకు నిజరూపం ఇచ్చేందుకు కొత్త ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఫెడరల్ బ్యాంక్ ఎపుడూ మద్దతు ఇస్తుందని ఎండీ, సీఈఓ శ్యామ్ శ్రీనివాసన్ పేర్కొన్నారు.