ఏడుపాయల వద్ద మంజీరా పరవళ్లు.. మీరూ చూడండి.. - ఏడుపాయల తాజా సమాచారం
🎬 Watch Now: Feature Video

Edupayala Temple: భారీ వర్షాల కారణంగా గత మూడు రోజులుగా మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గ ప్రాజెక్టు పొంగి పొర్లుతోంది. దీంతో మంజీరా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వన దుర్గమ్మ ఆలయం ముందు ఉన్న పాయ నుంచి నీరు ప్రవహించడంతో అప్రమత్తమైన ఆలయ సిబ్బంది గుడి మూసివేశారు. ఆలయ రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్నారు. గుడి వైపు భక్తులు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.