ఎన్నికల్లో ఓడిపోయినా కాంగ్రెస్ సంబరాలు.. ఎందుకంటే? - మధ్యప్రదేశ్ జిల్లా పంచాయతీ ఎన్నికలు
🎬 Watch Now: Feature Video
ఎన్నికల్లో గెలిచిన తర్వాత అభ్యర్థి, పార్టీ సంబరాలు చేసుకోవడం సాధారణమే. అయితే ఓడిపోయిన అభ్యర్థి, పార్టీ సంబరాలు చేసుకోవడం ఎప్పుడైనా చూశారా? మధ్యప్రదేశ్ ధార్ జిల్లాలో అలాంటిదే జరిగింది. జిల్లా పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్, భాజపా అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చాయి. లాటరీ వేయగా భాజపా అభ్యర్థి గెలుపొందారు. అయితే ఓటమితో నిరాశ చెందకుండా కాంగ్రెస్ సంబరాలు చేసుకుంది. ఈ సంబరాల్లో రాష్ట్ర మాజీ మంత్రి ఉమంగ్ సింఘార్, ధార్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బాల్ముకుంద్ గౌతమ్‌తో పాటు వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ఓటమి తర్వాతే గెలుపు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని కోరారు.