జాతీయ జెండా ఆకృతిలో వేలాది విద్యార్థులు వరించిన గిన్నిస్​ రికార్డ్​ - పళనిలో తిరంగా ర్యాలీ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 13, 2022, 5:59 PM IST

పంజాబ్​ చండీగఢ్‌లోని ఓ విశ్వవిద్యాలయం విద్యార్థులు జాతీయ జెండా ఆకారంలో నిల్చొని గిన్నిస్ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్ నెలకొల్పారు. త్రివర్ణ పతాకంలోని మూడు రంగుల దుస్తులు ధరించిన విద్యార్థులు జాతీయజెండా మాదిరిగా మైదానంలో నిల్చున్నారు. ఈ ప్రదర్శనలో 5,885 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పటివరకు యూఏఈ పేరుపై ఉన్న రికార్డును చండీగఢ్‌ విద్యార్థులు అధిగమించారు. మరోవైపు, కర్ణాటక.. కలబురగిలోని ఓ రైతు తన 23 ఎకరాల వ్యవసాయ భూమిలో అంత పెద్దదైన జాతీయ జెండాను ఎగరవేశాడు. ఈ జెండా 75 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పు ఉంది. తిరంగా మొత్తం బరువు 140 కేజీలు. తమిళనాడులోని పళనిలో భాజపా శ్రేణులు 500 మీటర్ల పొడవైన భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వేలాది మంది ప్రజలు, భాజపా కార్యకర్తలు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.