ముగ్గు వేస్తుండగా మహిళ 'గోల్డ్ చైన్' చోరీ.. నోరు మూసేసి మరీ.. - దొంగ స్నాచింగ్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 9, 2022, 4:16 PM IST

ముగ్గు వేస్తుండగా ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును దొంగ అపహరించిన ఘటన కర్ణాటకలోని హసన్​ జిల్లాలో జరిగింది. హోలేనరసీపుర్ పట్టణంలోని సరస్వతి అనే మహిళ ముగ్గు వేస్తున్న సమయంలో ఓ దొంగ ఒక్కసారిగా ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును తెంపేందుకు ప్రయత్నించాడు. వెంటనే బాధిత మహిళ గట్టిగా కేకలు వేసింది. దీంతో ఆమె నోరు మూసేసి గొలుసు తెంపుకుని దొంగ పారిపోయాడు. అయితే ఆ దొంగ తెలివిగా తన ఆచూకీ తెలియకుండా ఉండేందుకు హెల్మెట్ పెట్టుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీటీవీలో ఘటనా దృశ్యాలు రికార్డు అయ్యాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.