ట్రాక్టర్​ బోల్తాపడి యువకుడు మృతి.. బైక్​ రైడర్​ లక్కీగా! - బైతూల్​ వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 14, 2022, 9:58 PM IST

మధ్యప్రదేశ్​లోని బైతూల్​కు చెందిన ఓ యువకుడు.. ట్రాక్టర్​ మీదపడి మరణించాడు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పొలంలోని బురదలో సుఖ్​దేవ్​ ట్రాక్టర్​ కూరుకుపోయింది. దానిని బయటకు తీసేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా ట్రాక్టర్​ బోల్తా పడింది. దీంతో సుఖ్​దేవ్​ అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరోవైపు, కేరళలోని ఎర్నాకులంలోని భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. కొత్తమంగళం రోడ్డులో అకస్మాత్తుగా ఓ విద్యుత్ స్తంభం నేలకూలింది. అదే సమయంలో అటువైపుగా వెళ్తున్న ఓ బైక్ ​రైడర్​.. త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. మరో వైపు నుంచి వస్తున్న ఓ కారు కూడా భారీ ప్రమాదం నుంచి బయటపడింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.