ETV Bharat / technology

ఐఫోన్ SE 4 లాంఛ్ డేట్ రివీల్!- టిమ్​కుక్ వదిలిన టీజర్ చూశారా? - IPHONE SE 4 LAUNCH DATE

యాపిల్ కొత్త ప్రొడక్ట్ టీజర్ రిలీజ్ చేసిన సీఈవో టిమ్‌కుక్- ఐఫోన్ SE 4 మోడల్ రిలీజ్ డేట్ ఇదే!

Tim Cook Shares a New Teaser
Tim Cook Shares a New Teaser (Photo Credit- X/Tim Cook)
author img

By ETV Bharat Tech Team

Published : Feb 14, 2025, 3:53 PM IST

iPhone SE 4 Launch Date: టెక్ దిగ్గజం యాపిల్​ నుంచి కొత్త ప్రొడక్ట్ త్వరలో మార్కెట్​లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ మేరకు యాపిల్ సీఈవో టిమ్ కుక్ తన సోషల్ మీడియా ప్లాట్​ఫారమ్ ఎక్స్​లో ఒక పోస్ట్ ద్వారా వెల్లడించారు. ఇందులో తన అప్​కమింగ్ ప్రొడక్ట్ టీజర్​ను రిలీజ్ చేయడంతో పాటు లాంఛ్ తేదీని కూడా ప్రకటించారు. అయితే ఇది యాపిల్ అప్​కమింగ్ 'ఐఫోన్ SE 4' టీజర్ అని తెలుస్తోంది. ఈ సందర్భంగా దీనిపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.

టీజర్‌ను విడుదల చేసిన టిమ్ కుక్: టిమ్ కుక్ కొన్ని గంటల క్రితం తన 'X' ఖాతా ద్వారా ఒక పోస్ట్ షేర్ చేశారు. అందులో 7 సెకన్ల టీజర్ కనిపిస్తుంది. దీనిలో ఆపిల్ లోగో స్టన్నింగ్ లుక్​లో మెరుస్తూ కనిపిస్తుంది. ఈ టీజర్‌తో టిమ్ కుక్ 'గెట్ రెడీ టూ మీట్ ఏ న్యూ మెంబర్ ఇన్ అవర్ ఫ్యామిలీ' అని రాసుకొచ్చారు. దీనితో పాటు అందులో బుధవారం, ఫిబ్రవరి 19, యాపిల్ లాంఛ్​ అని కూడా పేర్కొన్నారు.

అంటే యాపిల్ ఫిబ్రవరి 19న తన కొత్త ప్రొడక్ట్​ను లాంఛ్ చేయనున్నట్లు వెల్లిడించేందుకు ఈ విధంగా రాసుకొచ్చారు. అయితే ఆ కొత్త ప్రొడక్ట్ పేరును మాత్రం అందులో ప్రస్తావించలేదు. అయితే ఇటీవల రిలీజ్ అయిన కొన్ని నివేదికల ప్రకారం యాపిల్ త్వరలో తన చౌకైన ఐఫోన్ SE 4ను లాంఛ్ చేసేందుక సన్నాహాలు చేస్తోంది. దీంతో ఇప్పుడు టిమ్​కుక్ రిలీజ్ చేసిన ఈ టీజర్​ ఈ మోడల్​దే అని టెక్ నిపుణులు భావిస్తున్నారు. దీంతో యాపిల్​ ఫిబ్రవరి 19న ఐఫోన్ SE 4ను విడుదల చేయబోతోందని తెలుస్తోంది.

ఐఫోన్ SE 4 అంచనా ఫీచర్లు: ఈ అప్​కమింగ్ ఐఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇప్పటికే దాని డమ్మీ యూనిట్ లీక్ అయింది. దీని ద్వారా ఈ ఫోన్ డిజైన్ ఐఫోన్ 14 మాదిరిగా ఉంటుందని తెలుస్తోంది. ఇటీవలే అనుకోకుండా ఫోన్ కవర్ డిజైన్​ కూడా లీక్ అయింది. ఇది ఫోన్​ డిజైన్​ను రివీల్ చేసింది. దీంతో ఇది ఐఫోన్ 14 బేస్ మోడల్​ను పోలి ఉంటుందని అంతా భావిస్తున్నారు. ఇక ఈ ఫోన్ USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్, సింగిల్ బ్యాక్ కెమెరా లెన్స్, గ్లాస్ ఫినిషింగ్, యాపిల్ ఇంటెలిజెన్స్‌తో కంపెనీ లేటెస్ట్ A18 చిప్‌సెట్​తో వస్తుందని తెలుస్తోంది. ఇదే చిప్​సెట్ కొన్ని నెలల క్రితం లాంఛ్ అయిన యాపిల్ లేటెస్ట్​ ఐఫోన్​ 16లో కూడా వినియోగించారు.

OTT లవర్స్​కు గుడ్​న్యూస్- జియోహాట్‌స్టార్‌ వచ్చేసిందోచ్- సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్స్‌ ఇవే!

క్వాల్​కామ్​ నుంచి పవర్​ఫుల్ చిప్​సెట్ లాంఛ్- దీని స్పీడ్​ ఎంతో తెలిస్తే షాకే!

హాయ్ బేబీ అంటున్నారా?- ఆ పిలుపు ముంచే వలపు- హనీ ట్రాప్​లో చిక్కారో ఇక అంతే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.